Ashok Gehlot | రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) అనారోగ్యం బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కొవిడ్ పాజిటివ్ (Covid Positive) అని తేలింది. దాంతోపాటు స్వైన్ ఫ్లూ (swine flu) కూడా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని అశోక్ గెహ్లాట్ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు.
తాను గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపారు. వైద్యుల సూచనల మేరకు పరీక్షలు చేయించుకోగా కొవిడ్, స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. ఆరోగ్యం కుదుట పడేవరకూ ఎవరినీ కలవలేనంటూ ట్వీట్ చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
Also Read..
Rishabh Pant | ఇంగ్లండ్‌కు ‘బజ్‌బాల్’ ఉంటే.. మనకు ‘రిషి బాల్’ ఉందిగా
Nirmala Sitharaman | ఐటీ శ్లాబ్‌ల సవరణ ప్రజాకర్షక విధానాలక్కర్లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ..!
USA | ఇరాన్, సిరియాలో అమెరికా ప్రతీకార దాడులు.. 18 మంది మిలిటెంట్లు హతం