USA | మాతో పెట్టుకుంటే ఇంతే.. ఇరాన్, సిరియాలో అమెరికా ప్రతీకార దాడులు.. 18 మంది హతం
ఇటీవల జోర్డాన్ (Jordan)లో తమ క్యాంప్‌పై దాడి చేసిన ఘటనకు ప్రతిగా అమెరికా (USA) దాడులు మొదలు పెట్టింది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల (IRGC) మద్దతు కలిగిన 85కుపైగా మిలీషియా స్థావరాలే లక్ష్యంగా అమెరికా యుద్ధవిమానాలు దాడులు చేశాయి.
వాషింగ్టన్: ఇటీవల జోర్డాన్ (Jordan)లో తమ క్యాంప్‌పై దాడి చేసిన ఘటనకు ప్రతిగా అమెరికా (USA) దాడులు మొదలు పెట్టింది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల (IRGC) మద్దతు కలిగిన 85కుపైగా మిలీషియా స్థావరాలే లక్ష్యంగా అమెరికా యుద్ధవిమానాలు దాడులు చేశాయి. దీంతో సిరియాలో 18 మంది మిలిటెంట్లు మృతి చెందారు.
మిలిటెంట్లకు చెందిన కమాండ్ కంట్రోల్ ప్రధాన కేంద్రంతోపాటు ఇంటెలిజెన్స్ కేంద్రాలు, రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లు, ఆయుధ సామాగ్రి నిల్వల గోడౌన్లు, లాజిస్టిక్స్ సౌకర్యాలపై దాడులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జోర్డాన్‌లోని అమెరికా సైనిక క్యాంప్‌పై ఇటీవల డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ముగ్గురు అమెరికా సైనికులు మృతిచెందగా, సుమారు 40 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరిగినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.
అమెరికన్లకు ఎవరైనా హాని కలిగిస్తే, తాము తగిన సమాధానం ఇస్తామని ఈ దాడుల తరువాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ఆదివారం జోర్డాన్‌లో ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద గ్రూపులు జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారని ఆయన చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Airstrikes
- Attack
- iran
- Iraq
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

