గురువారం 26 నవంబర్ 2020
National - Sep 16, 2020 , 17:26:37

మాట‌లు రాక‌ముందే ఈ పిల్ల 'ప్రాంక్ వీడియో'.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

మాట‌లు రాక‌ముందే ఈ పిల్ల 'ప్రాంక్ వీడియో'.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఒక చిన్న అమ్మాయి. వ‌య‌సు ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం ఉండొచ్చు. అడుగులు కూడా వేస్త‌దో లేదో కాని నిలబ‌డి ఉంది. ప‌క్క‌నే ఒక వాట‌ర్ క్యాన్ కూడా ఉంది. అయితే అందులో చేయి పెట్టి ఇరుక్కుపోయిన‌ట్లు ఏడ్చి కుటుంబ స‌భ్యుల్ని భ‌య‌పెట్టింది. పాప ఫేస్ ఎక్స్‌ప్రెష‌న్ చూస్తే ఎవ‌రైనా ఖంగారు ప‌డాల్సిందే. అంత‌లా యాక్ట్ చేసింది.

16 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను చిన్నారి యాక్టింగ్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే అంటున్నారు. ఈ వీడియోను ట్విట‌ర్ హ్యాండిల్ 'బ్యాక్ టు నేచ‌ర్' షేర్ చేసింది. ఓహ్‌.. నేను ఇరుక్కుపోయాను అనే శీర్షిక‌ను జోడించారు. తీరా పాప‌ను ర‌క్షించేందుకు ద‌గ్గ‌ర‌కు రాగానే చేయి బ‌య‌ట‌కు తీసి ప‌క‌ప‌కా న‌వ్వింది. ఈ చిన్నారి అల్ల‌రికి అంద‌రూ ఫిదా అయ్యారు. అందుకే ఆన్‌లైన్‌లోకి వ‌చ్చిన కాసేప‌టికే వీడియో వైర‌ల్ అయింది. దీనిని ఇప్ప‌టివ‌ర‌కు 22 వేల మంది వీక్షించారు.