Vladimir Kramnik : ప్రపంచ చెస్‌లో భారత కుర్రాళ్లు ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో ఓ షాకింగ్ న్యూస్. యువ గ్రాండ్ మాస్టర్ నిహల్ సరిన్(Nihal Sarin)పై మాజీ వరల్డ్ చాంపియన్ వ్లాదిమిర్ క్రామ్నిక్ (Vladimir Kramnik) సంచలన ఆరోపణలు చేశాడు. ఆన్లైన్ చెస్‌లో 19 ఏండ్ల నిహల్ చీటింగ్‌కు పాల్పడ్డాడని క్రామ్నిక్ అన్నాడు.
ఈ ఏడాది ప్రపంచంలోని టాప్ 10 ఆటగాళ్లతో నిహల్ ఆన్లైన్ బ్లిట్జ్‌లో తలపడ్డాడు. అయితే.. గణిత శాస్త్ర లెక్కల ప్రకారం ఒక ఆటగాడు 99.9999 శాతం పాయింట్లు సాధించడం దాదాపు అసాధ్యం అని క్రామ్నిక్ తెలిపాడు.
నిహల్ 14 ఏండ్ల వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగాడు. బ్లిట్జ్ రేటింగ్ 2,704 పాయింట్లతో నిహల్ విజేతగా అవతరించాడు. అయితే.. నిహల్ మేనేజర్ ప్రియదర్శన బంజన్ మాత్రం అవేవీ నిజం కాదని తేల్చిపారేశాడు. ‘క్రామ్నిక్కు దమ్ముంటే నిహల్తో ముఖాముఖిగా తలపడాల’ని సవాల్ విసిరాడు. బంజన్ చాలెంజ్‌కు క్రామ్నిక్ ఇంకా స్పందించలేదు.