Poonch terror attack | ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదుల స్కెచ్‌లు విడుదల.. సమాచారం ఇచ్చిన వారికి రూ.20 లక్షల రివార్డు ప్రకటన
Poonch terror attack | జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) వాహనంపై దాడి చేసిన ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదుల స్కెచ్లను భద్రతా దళాలు విడుదల చేశాయి. వీరి అరెస్ట్ కోసం సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించాయి.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో భారత వైమానిక (ఐఏఎఫ్) దళం వాహనంపై దాడి చేసిన ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదుల స్కెచ్లను భద్రతా దళాలు విడుదల చేశాయి. వీరి అరెస్ట్ కోసం సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించాయి. శనివారం సాయంత్రం పూంచ్‌లోని షాసితార్ సమీపంలో ఐఏఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. (Poonch terror attack) ఆకస్మిక దాడిలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కార్పోరల్ విక్కీ పహాడే మరణించగా మరో నలుగురు సిబ్బంది గాయపడ్డారు.
కాగా, ఉగ్రవాదుల దాడి అనంతరం భద్రతా బలగాలు షాసితార్ ప్రాంతంలో భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సాయుధ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలను ముమ్మరం చేశారు. దాడి చేసిన ఉగ్రవాదుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. చాలా మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆదివారం పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

