Sai Dharam Tej | ఎన్నికల ప్రచారంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్‌పై దాడికి యత్నం
Sai Dharam Tej | మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej)పై కొందరు ఆకతాయిలు దాడికి ప్రయత్నించారు. రాళ్లు, గాజు సీసాలను సాయి తేజ్‌పై విసిరారు.
Sai Dharam Tej | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. పోలింగ్‌కు సరిగ్గా వారం రోజులే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇక రాజకీయ నాయకులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో జనసేన పార్టీ తరఫున మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కూడా ప్రచారం చేసేందుకు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తి వెళ్లారు. అక్కడ హీరోపై కొందరు ఆకతాయిలు దాడికి ప్రయత్నించారు. రాళ్లు, గాజు సీసాలను సాయి తేజ్‌పై విసిరారు. అయితే, తృటిలో ఆయన ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. ఈ దాడిలో నల్లల శ్రీధర్ అనే జనసైనికుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని హుటాహుటిన పిఠాపురంలోని జీజీహెచ్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు సాయి ధరమ్ తేజ్‌పై దాడి ప్రయత్నాన్ని జనసేన పార్టీ ఖండించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించింది. జనసేన పార్టీ ర్యాలీ సందర్భంగా వైసీపీ రౌడీలు ఘర్షణ వాతావరణం సృష్టించి జన సైనికులను భయాందోళనలకు గురి చేసేందుకు రాళ్లు, గాజు సీసాలు విసిరే ప్రయత్నం చేశారని మండిపడింది. రౌడీయిజంతో బెదిరించాలని చూస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. ఈ దాడి ఘటనలో గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జన సైనికుడు శ్రీధర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
శ్రీ సాయి ధరమ్ తేజ్ గారిపై దాడి ప్రయత్నాన్ని ఖండిస్తున్నాం
వైసీపీ మార్కు రౌడీయిజంతో బెదిరించాలని చూస్తే ఉపేక్షించేది లేదు
జన సైనికుడు శ్రీధర్ తలకు గాయం కావడం బాధాకరం
పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీధర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం @IamSaiDharamTej… pic.twitter.com/HOJEAr3awx
— JanaSena Party (@JanaSenaParty) May 6, 2024
🚨🚨 High Alert 🚨 🚨
ఈరోజు పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని తాటిప్రతి గ్రామంలో ప్రచారం సందర్భంగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గారిపై రాళ్లు, గాజు సీసాలు విసిరే ప్రయత్నం చేసిన వైకాపా రౌడీలు. ఒక జనసైనికుడి తలకు గాయాలు, పిఠాపురం GGH లో చికిత్స. @IamSaiDharamTej @NagaBabuOffl… pic.twitter.com/c2LpSfh8DO
— Dr. Sandeep Panchakarla (@DrSandeepJSP) May 5, 2024
Also Read..
Taapsee Pannu | పెళ్లి తర్వాత ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న తాప్సీ.. ఫొటోలు
Double iSmart | క్రేజీ న్యూస్.. రామ్ డబుల్ ఇస్మార్ట్ టీజర్ లాంఛ్ డేట్ ఇదే..!
ARYA Movie | 20 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న ‘ఆర్య’.. భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.?
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

