Leopard | రాజస్థాన్ (Rajasthan)లో ఓ చిరుతపులి (Leopard) హల్చల్ చేసింది. నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించి స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. బంధించబోయిన అధికారులపై దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటనలో అటవీ శాఖ అధికారితోపాటు (forest officials) మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
ఓ పెద్ద పులి అటవీ సమీప ప్రాంతంలోని ఓ గ్రామంలోకి ప్రవేశించింది. గ్రామ వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. దీంతో స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కోట నుంచి వచ్చిన అటవీ అధికారుల బృందం స్థానికుల సాయంతో చిరుతను బంధించే ప్రయత్నం చేసింది (rescue).
మంచం, కర్రలు, వలను ఉపయోగించే చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. బంధించే క్రమంలో చిరుత వారిపై దాడి చేసింది. ఈ దాడిలో అటవీ అధికారి ముల్చంద్ శర్మ, స్థానికుడైన లాడు సింగ్ తీవ్ర గాయాలపాలయ్యారు. చిరుత మాత్రం వారి నుంచి తప్పించుకుని అటవీ ప్రాంతంలోకి పరుగులు తీసింది.
Also Read..
OTT platforms | న్యూడ్ కంటెంట్.. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం నిషేధం
Lok Sabha Polls | రెండు జాబితాలు.. 21 శాతం సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ నో టిక్కెట్..