Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) తన మతిమరుపుతో మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికాలోని యూఎస్ దేశంలో అని సంబోధించి ప్రతిపక్షాలకు టార్గెట్ అయ్యారు.
బుధవారం విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ (Milwaukee)లో జరిగిన ఓ కార్యక్రమంలో అధ్యక్షుడు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యల్ప ద్రవ్యోల్బణ రేట్లను (lowest inflation) యూఎస్ కలిగి ఉందని చెప్పడానికి బదులుగా.. అమెరికాలో ఏ దేశంలో లేనంత తక్కువ ద్రవ్యోల్బణ రేట్లు యూఎస్‌లో ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ‘ధరల కంటే వేతనాలే వేగంగా పెరుగుతున్నాయి. అమెరికాలోని ఏ దేశానికీ లేనంత తక్కువ ద్రవ్యోల్బణం రేట్లు యూఎస్‌లో ఉన్నాయి. దాన్ని మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాము’ అంటూ వ్యాఖ్యానించారు.
అధ్యక్ష ఎన్నికలు (US Presidential Elections) సమీపిస్తున్న వేళ బైడెన్ వ్యాఖ్యలు ప్రత్యర్థులకు ప్రచారస్త్రంగా మారాయి. పలువురు రిపబ్లికన్ పార్టీ నేతలు బైడెన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అమెరికాలో దేశాలు ఉన్నాయా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
JUST IN – Biden: “We have among the lowest inflation rates of any country in America!” pic.twitter.com/81ct8r6DZw
— Insider Paper (@TheInsiderPaper) March 14, 2024
Also Read..
Tik Tok | అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్.. నిషేధ బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం
jewellery shop | నగల దుకాణంలో దుండగుల కాల్పులు.. ఇద్దరికి గాయాలు
OTT platforms | న్యూడ్ కంటెంట్.. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం నిషేధం