jewellery shop | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో గురువారం ఉదయం కాల్పుల ఘటన (Shootout) కలకలం రేపింది. కొడిగేహళ్లి (Kodigehalli) ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరపడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
ఇద్దరు దుండగులు గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో దేవీనగర్ (Devinagar)లోని నగల దుకాణం (jewellery shop) వద్దకు వచ్చారు. దుకాణంలో పట్టపగలే చోరీకి యత్నించారు. అయితే నగల దుకాణం యజమాని వారిని అడ్డుకోవడంతో దుండగులు కాల్పులు జరిపారు. మొత్తం మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో దుకాణం యజమానితోపాటు సిబ్బందికి గాయాలయ్యాయి. కాల్పుల అనంతరం దుండగులు తుపాకీని అక్కడే వదిలి పారిపోయారు. దుండగులు బైక్‌పై పారిపోతున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారికి ఆసుపత్రికి తరలించారు. అనంతరం దుకాణాన్ని పరిశీలించారు. అక్కడ ఎలాంటి నగలూ పోలేదని గుర్తించారు. అయితే, నగల దుకాణం యజమానిని హత్య చేసేందుకే వారు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల జాడ కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.
Also Read..
OTT platforms | న్యూడ్ కంటెంట్.. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం నిషేధం
Lok Sabha Polls | రెండు జాబితాలు.. 21 శాతం సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ నో టిక్కెట్..
Jamili Elections | జమిలిపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన కోవింద్ కమిటీ