కానిస్టేబుల్ కుటుంబానికి బీమా చెక్కు
విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన ఏఆర్ కానిస్టేబుల్ వీ చరణ్‌కుమార్ కుటుంబానికి డీజీపీ సీవీ ఆనంద్ రూ.కోటి బీమా చెకును అందజేశారు. 2018 బ్యాచ్‌కు చెందిన చరణ్‌కుమార్ ఈగల్ ఫోర్స్‌లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తూ 2025 సెప్టెంబర్ 22న అర్ధరాత్రి విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా మహారాష్ట్రలోని దేవారర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.
- రూ.కోటి చెకు అందజేసిన డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన ఏఆర్ కానిస్టేబుల్ వీ చరణ్‌కుమార్ కుటుంబానికి డీజీపీ సీవీ ఆనంద్ రూ.కోటి బీమా చెకును అందజేశారు. 2018 బ్యాచ్‌కు చెందిన చరణ్‌కుమార్ ఈగల్ ఫోర్స్‌లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తూ 2025 సెప్టెంబర్ 22న అర్ధరాత్రి విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా మహారాష్ట్రలోని దేవారర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్స అనంతరం డి శ్చార్జి అయ్యాడు.
ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే అపస్మారక స్థితికి చేరడంతో కుటుంబసభ్యులు మళ్లీ దవాఖానకు తరలించారు. పరిశీలించిన వైద్యులు చరణ్ మృతిచెందినట్టు ప్రకటించారు. ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాం డిల్య, ఎస్పీ రఘువీర్, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి ఎస్బీఐతో సమన్వయంతో బీమా క్లెయిమ్ పూర్తిచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

