Farmers Protest | ధాన్యం కొనుగోలు చేయాలంటూ కప్రాయిపల్లిలో రైతుల ధర్నా
Farmers Protest | ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కప్రాయిపల్లి గ్రామ రైతులు సోమవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
Farmers Protest | భూదాన్ పోచంపల్లి, నవంబర్ 23: ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కప్రాయిపల్లి గ్రామ రైతులు సోమవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, రైతుల నుంచి వడ్లను తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని, వద్దురా నాయన వడ్ల కాడ రాజకీయం , పండించిన పంట దళారుల పాలాయే అంటూ నినాదాలు చేశారు.
నెల రోజుల క్రితం నుంచే రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొచ్చి పోసినా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదిలేక రైతులు రైస్ మిల్లర్లకు తక్కువ ధరకు ధాన్యం విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. పండించిన పంట దళారుల పాలవుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. వడ్ల కాడ రాజకీయం వద్దని.. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయకుండా వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి తమ పంటను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ధర్నాలో సీపీఐ మండల కార్యదర్శి గొడళ్ల నాగభూషణం, రైతులు మక్తాల మహేందర్, గొడల రాజేశ్వర్, సుధాకర్, సుంకరి కృష్ణ, కొంతం రాజు, మక్తాల జగన్, అంతటి రాములు, గొడల శ్రీనివాస్, కలిమి అంజయ్య, మన్నే కిష్టయ్య, ఎర్రబోతు ప్రభాకర్, మక్తాల భీమయ్య, రామాంజనేయ, గొడల నరసింహ, మక్తాల అమరేందర్, గంగాదేవి, సత్తయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | ధాన్యం కొనుగోలు చేయాలంటూ కప్రాయిపల్లిలో రైతుల ధర్నా
Viral Pic | అనిరుధ్–కావ్య మారన్ రిసెప్షన్లో విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నూతన దంపతులతో ఫొటో వైరల్!
IND vs NZ | చివరి రోజు కివీస్ పోరాటం.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు
Jagadish Reddy | బీఆర్ఎస్ నేతల అరెస్టుపై జగదీశ్ రెడ్డి ధ్వజం.. డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్
BRS | కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేస్తామంటే అరెస్టులా? బీఆర్ఎస్ నేతలకు పోలీసుల అడ్డంకులు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

