Naga Chaitanya | నాగచైతన్యకు లిప్ కిస్‌తో బర్త్ డే విషెస్.. శోభిత స్పెషల్ పోస్ట్ వైరల్!
Naga Chaitanya | టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య, శోభిత ధూళిపాళ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. వీరిద్దరూ తమ ప్రేమను, అనుబంధాన్ని అప్పుడప్పుడు సోషల్ మీడియా పోస్టుల ద్వారా వ్యక్తం చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంటారు. తాజాగా నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా శోభిత చేసిన స్పెషల్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Naga Chaitanya | టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య, శోభిత ధూళిపాళ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. వీరిద్దరూ తమ ప్రేమను, అనుబంధాన్ని అప్పుడప్పుడు సోషల్ మీడియా పోస్టుల ద్వారా వ్యక్తం చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంటారు. తాజాగా నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా శోభిత చేసిన స్పెషల్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. భర్తకు ప్రేమగా బర్త్ డే విషెస్ చెబుతూ షేర్ చేసిన ఫొటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. నేడు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా శోభిత ధూళిపాళ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకమైన ఫొటోలను షేర్ చేసింది. వెకేషన్ సమయంలో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇందులో నాగచైతన్యకు శోభిత లిప్ కిస్ ఇస్తున్న ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరో ఫొటోలో ఇద్దరూ ఎంతో క్లోజ్‌గా, ప్రేమగా కనిపిస్తున్నారు.
ఈ ఫొటోలను షేర్ చేస్తూ శోభిత ‘హ్యాపీ బర్త్ డే లవర్’ అంటూ ప్రేమగా విషెస్ తెలిపింది. దీంతో ఈ జంట అభిమానులు సోషల్ మీడియాలో ఈ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. నాగచైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహం తర్వాత తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను చాలా వరకు ప్రైవేట్‌గా ఉంచుతూనే, ప్రత్యేక సందర్భాల్లో అభిమానులతో ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఒకరి పుట్టినరోజు వచ్చినా, ఏదైనా ప్రత్యేక సందర్భమైనా మరొకరు సోషల్ మీడియాలో విషెస్ చెప్పడం అభిమానులకు ప్రత్యేకంగా అనిపిస్తోంది.
తాజాగా శోభిత చేసిన ఈ పోస్ట్‌తో మరోసారి వీరి మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం స్పష్టంగా కనిపిస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా లిప్ కిస్ ఫొటో నెట్టింట వైరల్ అవుతుండటంతో ఈ జంట పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య త్వరలో ‘వృషకర్మ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదల కానున్నట్లు సమాచారం. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు శోభిత ధూళిపాళ తమిళ సినిమా ‘వెట్టువం’ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. తన నటనతో ఇప్పటికే తెలుగు, హిందీ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న శోభిత.. ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naga Chaitanya | నాగచైతన్యకు లిప్ కిస్‌తో బర్త్ డే విషెస్.. శోభిత స్పెషల్ పోస్ట్ వైరల్!
Sampath Nandi | డింపుల్ హయతికి బహిరంగంగా క్షమాపణ చెప్పిన సంపత్ నంది.. ‘భోగి’ ట్రైలర్ లాంచ్‌లో ఆసక్తికర ఘటన!
Farmers Protest | ధాన్యం కొనుగోలు చేయాలంటూ కప్రాయిపల్లిలో రైతుల ధర్నా
Viral Pic | అనిరుధ్–కావ్య మారన్ రిసెప్షన్లో విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నూతన దంపతులతో ఫొటో వైరల్!
IND vs NZ | చివరి రోజు కివీస్ పోరాటం.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

