Landslide | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు కొండచరియలు (Landslide) విరిగిపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రాయ్ గఢ్ (Raigad) జిల్లా ఖలాపూర్ సమీపంలోని ఇర్హాల్ వాడీ గ్రామంలో గురువారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. గిరిజన గ్రామంపై కొండ చరియలు విరిగిపడటంతో సుమారు 48 కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి.
సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ (NDRF), పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి 22 మందిని సురక్షితంగా బయటకు తీసి వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాం. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ‘ఇప్పటి వరకూ 22 మందిని రక్షించాము. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రస్తుతం 100 మంది పోలీసు అధికారులు, జిల్లా యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొంటోంది’ అని రాయ్ గఢ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Also Read..
Manipur Violence | మణిపూర్ అల్లర్లపై లోక్సభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
Minister KTR | మోదీజీ.. అమిత్ జీ ఎక్కడున్నారు..? మణిపూర్ ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్
Samantha | ధ్యానం ప్రశాంతతకి అత్యంత శక్తివంతమైన మార్గం.. సమంత పోస్ట్ వైరల్