Lalu Yadav | బీహార్ ఎన్నికల్లో (Bihar Assembly elections) ఆర్జేడీకి గట్టి షాక్ తగిలిన విషయం తెలిసిందే. రెండు విడతల్లో 243 స్థానాలకు జరిగిన ఎలక్షన్లో నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని ఎన్డేయే (NDA) కూటమి 202 స్థానాల్లో జయభేరి మోగించింది. ఇక అధికారంలోకి రావాలనుకున్న ఆర్జేడీ నేతృత్వంలోని ప్రతిపక్ష మహాఘఠ్బంధన్ (Mahagathbandhan) కూటమి ఘోర పరాభవం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమి నుంచి కోలుకోకముందే ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్‌కు మరో షాక్ తగిలింది. ఆయన కుమార్తె రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు.
ఆర్జేడీ (RJD) అధినేత లాలూ యాదవ్ (Lalu Yadav) కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Acharya) సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, కుటంబంతో సంబంధాలను కూడా తెంచుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. అలాగే నేను నా కుటుంబాన్ని కూడా వదులుకుంటున్నాను. సంజయ్ యాదవ్, రమీజ్ నన్ను చేయమని అడిగింది ఇదే’ అంటూ సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాభవం వేళ రోహిణి ఆచార్య ప్రకటన అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. కాగా, రోహిణి ఆచార్య వృత్తీరీత్యా వైద్యురాలు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని సరన్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే, బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు.
Also Read..
Bihar election results | ఆర్జేడీకే ఎక్కువ ఓట్లు.. బీజేపీ, జేడీ(యూ)కి దక్కిన సీట్లు
RK Singh Suspended | బీహార్‌లో రెబల్స్‌పై బీజేపీ చర్యలు.. మాజీ మంత్రితో సహా ముగ్గురు నేతలు సస్పెండ్
Delhi Blast | డాక్టర్ డ్రెస్‌లో సూసైడ్ బాంబర్ ఉమర్.. కొత్త ఫొటో వైరల్