Delhi Blast | ఢిల్లీలో పేలుడు (Delhi Blast)కు పాల్పడిన డాక్టర్ ఉమర్ మహమ్మద్ (Umar Mohammad) ఫొటో ఒకటి ప్రస్తుతం బయటకు వచ్చింది. వైద్యుడి డ్రెస్సు (Doctors Attire)లో ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. అందులో తెల్లకోటు వేసుకొని, మెడలో స్టెతస్కోప్‌తో ప్రాణాలను కాపాడే వ్యక్తిగా ఉమర్ కనిపించాడు.
పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీ ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 10వ తేదీన సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఢిల్లీలో పేలుడుకు పాల్పడిన విషయం తెలిసిందే. ఎర్రకోట (Red Fort) సమీపంలోని మెట్రో స్టేషన్ (Delhi Blast) దగ్గర ఉన్న సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
జమ్మూకశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌ను పోలీసులు బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌తో డాక్టర్ ఉమర్‌కు లింకు ఉన్నట్లు తేల్చారు. అదీల్, షకీల్‌ను అరెస్టు చేశారు. ఆ ఇద్దర్నీ అరెస్టు చేసినట్లు తెలుసుకున్న ఉమర్.. ఫరీదాబాద్ నుంచి తప్పించుకున్నాడు. దొరికిపోతానన్న భయంతో తెలుపురంగు హుందాయ్ ఐ20 కారులో ఢిల్లీకి వచ్చిన ఉమర్.. అక్కడ తన వాహనాన్ని తానే పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు.
Also Read..
Metro Station | ఢిల్లీ పేలుడు.. నాలుగు రోజుల తర్వాత తెరుచుకున్న రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్
Delhi Blast | ఎర్రకోట వద్ద పేలుడుకు 2కిలోల అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం ఉపయోగించిన ఉమర్
Apple CEO | యాపిల్‌ను వీడనున్న టిమ్ కుక్.. ఆయన తర్వాత సీఈవో ఎవరు..?