Apple CEO | ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ, ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ (Apple)ను టిమ్ కుక్ (Tim Cook) త్వరలోనే వీడే అవకాశం కనిపిస్తోంది. టిమ్ కుక్ ఈ నెలలో 65 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన యాపిల్ సీఈవో (Apple CEO) బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. దీంతో టిమ్ కుక్ తర్వాత యాపిల్‌కు తదుపరి సీఈవో ఎవరు? అన్న చర్చ మొదలైంది. టిమ్ కుక్ వారసుడిగా ఎవరు రానున్నారు..? అన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సీఈవో రేసులో సంస్థలో పనిచేస్తున్న జాన్ టర్నస్ (John Ternus) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
జాన్ ప్రస్తుతం యాపిల్‌లో హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టిమ్ కుక్ తర్వాత ఆ అత్యున్నత పదవిని చేపట్టబోయే వ్యక్తి జాన్ టర్నస్గా ప్రచారం జరుగుతోంది. జాన్ దాదాపు 24 సంవత్సరాలుగా యాపిల్‌లో ఉంటూ.. కీలక పదవులను చేపట్టారు. ప్రస్తుతం ఆయన వయసు 50 ఏళ్లు. యాపిల్ సీఈవోగా బాధ్యతలు తీసుకున్నప్పుడు టిక్ కుక్ వయసు కూడా 50 సంవత్సరాలే. 2011లో టిమ్ కుక్ యాపిల్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేశారు. ఆయన నాయకత్వంలో కంపెనీ తన ఉత్పత్తి శ్రేణిని భారీగా విస్తరించింది. టిమ్ కుక్ యాపిల్ ఆపరేషనల్ మాస్టర్ మైండ్ అయితే.. జాన్ టర్నస్ హార్డ్‌వేర్ ఆర్కిటెక్ట్. టర్నస్ 2001 లో యాపిల్‌లో చేరారు. ఆయనకు టిమ్ కుక్ దగ్గర మంచి పేరు ఉంది. అయితే సీఈవో బాధ్యతల నుంచి వైదొలిగే అంశం గురించి టిమ్ కుక్ ఇప్పటివరకు ఎలాంటి ప్రస్తావన చేయలేదు.
Also Read..
MK Stalin | ఇది ఇండియా కూటమికి ఓ పాఠం.. బీహార్ ఫలితాలపై సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు