MK Stalin | ఇది ఇండియా కూటమికి ఓ పాఠం.. బీహార్ ఫలితాలపై సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
MK Stalin | బీహార్‌లో ఇండియా కూటమి (INDIA Bloc) ఓటమిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఫలితాలు ఇండియా కూటమికి ఓ పాఠం అని పేర్కొన్నారు.
MK Stalin | యావత్ దేశం ఆసక్తికనబరిచిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) ఎన్డీఏ (NDA) కూటమి ప్రభంజనం సృష్టించింది. రెండు విడతల్లో 243 స్థానాలకు జరిగిన ఎలక్షన్లో నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని ఎన్డేయే (NDA) కూటమి 202 స్థానాల్లో జయభేరి మోగించింది. ఇక అధికారంలోకి రావాలనుకున్న ప్రతిపక్ష మహాఘఠ్బంధన్ (Mahagathbandhan) కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో సాధించిన సీట్లలో సంగం కూడా దక్కించుకోలేక చితికిలపడింది. కేవలం 34 స్థానాలతో సరిపెట్టుకుంది.
ఈ నేపథ్యంలో బీహార్‌లో ఇండియా కూటమి (INDIA Bloc) ఓటమిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఫలితాలు ఇండియా కూటమికి ఓ పాఠం అని పేర్కొన్నారు. ఈ మేరకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు అభినందనలు తెలియజేశారు. ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా కృషి చేసిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు కూడా అభినందనలు తెలిపారు. ‘ఎన్నికల ఫలితాలు సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక, సైద్ధాంతిక సంకీర్ణాలు, రాజకీయ సందేశంపై ఆధారపడి ఉంటాయి. ఇండియా కూటమిలో అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు ఉన్నారు. సవాళ్లను పరిష్కరించేందుకు వ్యూహాత్మకంగా ప్రణాళిక వేయగల సామర్థ్యం కలిగిన నాయకులు ఉన్నారు. ఈ ఫలితాలు ఇండియా కూటమికి ఓ పాఠం లాంటివి. దీంతో ఎంతో నేర్చుకోవాలి’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘంపై కూడా స్టాలిన్ విమర్శలు చేశారు. ఈ ఫలితంలో ఈసీపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయలేమని వ్యాఖ్యానించారు. ఈసీ ప్రతిష్ట దిగజారిపోయిందన్నారు.
Also Read..
కాంగ్రెస్‌లో మళ్లీ చీలిక తప్పదు : ప్రధాని మోదీ
Prashant Kishor | గెలిపించగలడేమో కానీ, గెలవలేడు!.. బీహార్‌లో పోటీచేసిన అన్ని స్థానాలలో ఘోర ఓటమి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

