Smriti Mandhana | భారత మహిళా జట్టులోని స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు (Wedding) తెలుస్తోంది. బాలీవుడ్ సింగర్ పలాశ్ ముచ్చల్ (Palash Muchhal)తో డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తాజా సమాచారం.
నవంబర్ 20వ తేదీన స్మృతి-పలాశ్ వివాహం అంగరంగ వైభవంగా జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి వివాహ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది (Wedding Invite Leaked). వీరి వివాహం మహారాష్ట్రలోని స్మృతి మంధాన స్వస్థలం సాంగ్లీలో జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు కూడా అందినట్లు తెలుస్తోంది. క్రికెట్, మ్యూజిక్ ఇండస్ట్రీ, రాజకీయ ప్రముఖులను ఆ మ్యారేజ్‌కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెళ్లి కార్డు ఫేక్ అంటూ పలువురు చెబుతున్నారు.
2025 వన్డే వరల్డ్‌కప్‌లో స్మృతి మంధాన (Smriti Mandhana) కొత్త రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో అత్యధిక రన్స్ చేసిన భారతీయ మహిళా బ్యాటర్‌గా నిలిచిందామె. 9 మ్యాచుల్లో ఆమె 434 రన్స్ చేసింది. మరోవైపు దేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న మహిళా క్రికెటర్ కూడా ఈమే కావడం విశేషం. రెక్సోనా డియోడ్రెంట్, నైక్, హ్యుందయ్, హెర్బాలైఫ్, ఎస్బీఐ, గల్ఫ్ ఆయిల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్ వంటి దాదాపు 16 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నారు. ఒక్కో బ్రాండ్‌కు ఆమె రూ.1.5-2 కోట్ల వరకూ సంపాదిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Also Read..
“Smriti Mandhana: స్మృతి మందానాకు ఆమె బాయ్‌ఫ్రెండ్ ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా?”
“ఇది సార్ అమ్మాయిల బ్రాండ్.. మహిళా క్రికెటర్ల కోసం క్యూ కడుతున్న కంపెనీలు”
ఇషాకు కాంస్యం.. మూడో పతకం కైవసం