ముంబై: 2025 వన్డే వరల్డ్‌కప్‌లో లేడీ క్రికెటర్ స్మృతి మందానా(Smriti Mandhana) కొత్త రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో అత్యధిక రన్స్ చేసిన భారతీయ మహిళా బ్యాటర్‌గా నిలిచిందామె. 9 మ్యాచుల్లో ఆమె 434 రన్స్ చేసింది. మ్యూజిక్ కంపోజర్ పలాస్ ముచ్చల్‌తో స్మృతి మందానా డేటింగ్ చేస్తున్నది. త్వరలో ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ ట్రోఫీతో కలిసి ఇద్దరూ ఫోటోలు దిగారు.
నిజానికి స్మృతి, పలాస్ ఆరంభంలో తమ రిలేషన్ దాచిపెట్టారు. తమ కెరీర్లపై దృష్టి పెట్టి సక్సెస్ సాధించారు. కుటుంబ సభ్యులు, కొందరు ఫ్రెండ్స్‌కు మాత్రమే ఆ ఇద్దరి మధ్య ఉన్న రొమాన్స్ తెలుసు. 2024లో పబ్లిక్‌గా ఆ రిలేషన్‌ను కన్ఫర్మ్ చేశారు. మందానా, ముచ్చల్ ఫ్యామిలీలు ఆ జంటకు సపోర్టు ఇస్తున్నారు.
ఫ్యామిలీకి చెందిన ప్రైవేటు ఫంక్షన్లో స్మృతికి పలాస్ ప్రపోజ్ చేసినట్లు తెలిసింది. ఆమెకు ఓ రొమాంటిక్ సాంగ్ కూడా డెడికేట్ చేశాడు. ఎంగేజ్మెంట్ కూడా రహస్యంగా జరిగింది. మహారాష్ట్రలోని స్మృతి స్వగ్రామం సాంగ్లీలో పెళ్లి చేసుకునేందుకు ఆ జంట రెఢీగా ఉన్నట్లు తెలుస్తోంది. క్రికెట్, మ్యూజిక్ ఇండస్ట్రీ ప్రముఖులను ఆ మ్యారేజ్‌కు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత స్మృతికి ఓ స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు పలాస్. తన చేయిపై ఎస్ఎం18 టట్టూ వేసుకున్నాడు మ్యూజిక్ కంపోజర్. ఎస్ఎం అంటే స్మృతి మందానా.. ఇక 18 ఆమె జెర్సీ నెంబర్ అని తెలుస్తోంది.
I hate you for not posting solo photos with trophy @mandhana_smriti pic.twitter.com/lX9EGw6oeA
— Crosswork11 (WORLD CUP CHAMPION SMRITI’S STAN ) (@Crosswork11) November 3, 2025