శ్రీనగర్: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బ్లాస్ట్ జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. కానీ ఫరీదాబాద్‌లో సీజ్ చేసిన పేలుడు పదార్ధాలు అనూహ్య రీతిలో కశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్(Nowgam Police Station)లో పేలాయి. శ్రీనగర్ శివారులో ఉన్న నౌగామ్ పోలీసు స్టేషన్లో శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు భారీ పేలుడు ఘటన జరిగింది. దీంట్లో పోలీసులతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు బలయ్యారు. 9 మంది మృతిచెందగా, 27 మంది గాయపడ్డారు. అయితే వైట్‌కాలర్ ఉగ్రవాదానికి పాల్పడుతున్న వైద్య బృందానికి చెందిన ఫరీదాబాద్‌లోని ఓ ఇంటి నుంచి కొన్ని రోజుల క్రితం జమ్మూకశ్మీర్ పోలీసులు సుమారు 360 కేజీల పేలుడు పదార్ధాలు స్వాదీనం చేసుకున్న విషయం తెలిసిందే.
Just in:
Explosion at the Nowgam Police Station of Srinagar, J&K. The police station was key to the recent anti-terror investigation. pic.twitter.com/aOv2NbXQvi
— Sidhant Sibal (@sidhant) November 14, 2025
డాక్టర్ ముజమ్మిల్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 360 కేజీల ఎక్స్‌ప్లోజివ్స్ నుంచి కొన్ని శ్యాంపిళ్లను దర్యాప్తు నిమిత్తం జమ్మూకశ్మీర్ పోలీసులకు అప్పగించారు. ఆ శ్యాంపిళ్లను పరిశీలిస్తున్న సమయంలో శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి పోలీసు స్టేషన్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ తర్వాత కొన్ని స్వల్ప స్థాయిలో వరుస పేలుళ్లు జరిగాయి. దీంతో బాంబు డిస్పోజల్ స్వ్వాడ్ వచ్చేందుకు కూడా ఆలస్యమైంది. రెస్క్యూ ప్రయత్నాల్లోనూ జాప్యం జరిగింది.
J&K: Accidental blast at Nowgam police station while handling Faridabad seized explosives; 6 killed, 27 injured
Eight personnel were injured in an accidental blast at the Nowgam police station in Srinagar late Friday night, killing six people and injuring 27 — mostly policemen… pic.twitter.com/zZAcMvSsxy
— Atulkrishan (@iAtulKrishan1) November 14, 2025
సీజ్ చేసిన పేలుడు పదార్దాల్లో కొంత పోలీసుల ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. అయితే 360 కేజీలకు చెందిన ఎక్స్‌ప్లోజివ్స్‌లో చాలా వరకు నౌగామ్ పోలీసు స్టేషన్లోనే స్టోర్ చేశారు. టెర్రర్ మాడ్యూల్‌కు చెందిన కేసును ఇక్కడే రిజిస్ట్రన్ చేయడం వల్ల.. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్ధాలను అక్కడే పెట్టారు.