Delhi Blast | ఢిల్లీలో పేలుడు (Delhi Blast) ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. కారు నడిపిన డాక్టర్ ఉమర్ నబీ బాంబు తయారీలో నిపుణుడని సంబంధిత వర్గాలు తాజాగా తెలిపాయి. ఇప్పటి వరకూ ఘటనాస్థలి నుంచి సేకరించిన దాదాపు 52కిపైగా పేలుడు పదార్థాల నమూనాలను ఫోరెన్సిక్ బృందం పరిశీలించింది.
ఎర్రకోట (Red Fort) వద్ద పేలుడుకు రెండు కిలోలకు పైగా అమ్మోనియం నైట్రేట్ (Ammonium Nitrate) ఉపయోగించినట్లు గుర్తించారు. దాంతోపాటూ పెట్రోలియం (Petroleum) వంటివి కూడా ఉపయోగించి పేలుడు పదార్థాన్ని తయారు చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఇలాంటి పేలుడు పదార్థాలను కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే తయారు చేయొచ్చని ఫోరెన్సిక్ వర్గాలు వెల్లడించాయి. పేలుడుకు ముందు ఉమర్ పార్కింగ్ స్థలంలో మూడు గంటల పాటూ ఏం చేశాడన్న దానిపై అధికారులు దార్యాప్తు చేస్తున్నారు. ఆ సమయంలోనే పేలుడు పదార్థాన్ని తయారు చేశాడా..? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
Also Read..
PM Modi | ఈనెల 25న అయోధ్యలో పతాక ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని మోదీ
Apple CEO | యాపిల్‌ను వీడనున్న టిమ్ కుక్.. ఆయన తర్వాత సీఈవో ఎవరు..?