Toll Charge | ఫాస్టాగ్ (Fastag) లేకుండా జాతీయ రహదారుల (National Highways)పై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఫాస్టాగ్‌లేనివారికి టోల్ ప్లాజాల (toll plaza) వద్ద విధిస్తున్న రెట్టింపు ఛార్జీ (Toll Charge)ల నిబంధనను సడలించింది. ఇకపై కేవలం 25 శాతం అదనపు రుసుము చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన నేటి నుంచి అమల్లోకి వచ్చింది.
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు ఫాస్టాగ్ తప్పనిసరిగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఫాస్టాగ్ లేనివారు టోల్ రుసుముకు రెండింతలు చెస్తున్నారు. నగదు రూపంలో అయినా యూపీఐ ద్వారా చెల్లించినా ఇదే నిబంధన వర్తిస్తోంది. నేషనల్ హైవేలపై టోల్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటే.. రూ.200 వరకూ వసూలు చేసే వారు. అయితే, ఆ నిబంధనలను కేంద్రం తాజాగా సడలించింది. తాజా నిబంధనల ప్రకారం.. ఫాస్టాగ్‌లేని వాహనదారులు యూపీఐ (UPI Payments) ద్వారా టోల్ ఛార్జీ చెల్లిస్తే 25 శాతం అదనంగా చెల్లిస్తే సరిపోతుంది. రూ.100కు 25 శాతం అదనంగా అంటే రూ.125 చెల్లించి వెళ్లొచ్చు. నగదు రూపంలో చెల్లిస్తే మాత్రం రెట్టింపు ఛార్జీ కట్టాల్సిందే. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Apple CEO | యాపిల్‌ను వీడనున్న టిమ్ కుక్.. ఆయన తర్వాత సీఈవో ఎవరు..?
రికార్డు కనిష్ఠాలకు ద్రవ్యోల్బణ గణాంకాలు.. ఈసారి వడ్డీరేట్లకు కోతలే!