న్యూఢిల్లీ, నవంబర్ 14 : హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియాకు చెందిన సీబీ1000 హార్నెట్ ఎస్పీ మోటర్‌సైకిల్‌ను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ బైకులో విడిభాగాల్లో సమస్య తలెత్తడంతో వెనక్కి పిలిపిస్తున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రస్తుత సంవత్సరంలో తయారైన బైకులను మాత్రమే వెనక్కి పిలిపించి, సమస్య తలెత్తిన విడిభాగాలను తిరిగి ఉచితంగా బిగించి ఇవ్వనున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.