e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News Konda Laxman Bapuji:ఉద్యమమే ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఊపిరి

Konda Laxman Bapuji:ఉద్యమమే ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఊపిరి

(Konda Laxman Bapuji) మూడు తరాల ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. కన్న కల తీరకముందే తుదిశ్వాస విడిచారు. అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా నిలచిన బాపూజీ.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా తన సర్వస్వం ధారబోసారు. తన జీవిత కాలం అంతా ప్రజల కోసమే పరితపించారు. ఎన్నో ఏండ్లు జైలు జీవితం గడిపారు.

ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడిలో 1915 సెప్టెంబర్‌ 27న జన్మించిన బాపూజీ.. చిన్నతనం నుంచే ఉద్యమ బాట పట్టారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కొండా లక్ష్మణ్‌ ప్రాథమిక విద్యాభ్యాసం ఆదిలాబాద్‌ జిల్లాలోనే సాగింది. ఇంటర్‌, డిగ్రీ హైదరాబాద్‌లోని సిటీ కాలేజీలో పూర్తి చేశారు. 1930 లలో స్వాతంత్య్ర సంగ్రామంలో కాలుమోపి తెల్లవారిని ఎదిరించారు. 1942 క్విట్‌ ఉద్యమంలో, 1952 నాన్‌ ముల్కీ ఉద్యమం, 1969 లో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం, 1996 మలిదశ ఉద్యమం.. ఇలా ఎన్నో ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ తొలి తరం ఉద్యమకారుల్లో బాపూజీ ఒకరు. తెలంగాణకు విముక్తి కల్పించేందుకు నిజాం పాలకులను ఎదురించారు. నారాయణ పటేల్‌తో కలిసి నిజాం నవాబుపై బాంబులు విసిరారు. ఈ కుట్ర కేసులో జైలు జీవితం గడిపారు.

- Advertisement -

అటు రాజకీయాల్లోనూ, ఇటు ప్రజా ఉద్యమాల్లోనూ తనదైన ప్రత్యేక ముద్రను చూపారు బాపూజీ. 1952లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై.. దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాల్లో పని చేశారు. రెండు సార్లు మంత్రిగా, ఒకసారి డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించారు. 1969లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా దీక్షచేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమకారులకు ఆదర్శంగా నిలిచారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సీనియర్‌ నేతగా తన ప్రభావాన్ని చూపగలిగారు. బాపూజీ సేవలకు గుర్తింపుగా ఆయన 106 వ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండటం విశేషం.

మరికొన్ని ముఖ్య సంఘటనలు..

ఇవాళ ప్రపంచ పర్యాటక దినోత్సవం
2001 : ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి) పై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం

1996 : ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ను ఆధీనంలోకి తీసుకున్న తాలిబాన్‌

1961 : ఐక్యరాజ్య సమితి వందో సభ్య దేశంగా సియర్రా లియోన్‌

1958 : బ్రిటిష్‌ ఛానల్‌ను ఈదిన తొలి భారతీయుడిగా నిలిచిన మిహిర్‌ సేన్‌

1905 : E=mc2 అనే సూత్రాన్ని పరిచయం చేసిన అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

1908 : తొలిసారిగా టీ మోడల్‌ కారును ఉత్పత్తి చేసిన ఫోర్డ్‌ కంపెనీ

1825 : ప్రపంచంలో తొలిసారిగా పబ్లిక్‌ రైల్వే ట్రాన్స్‌పోర్ట్‌ ప్రారంభం

ఇవి కూడా చ‌ద‌వండి..

ప్రపంచంలో ఇదే అతి తెల్లని పెయింట్‌..!

విషపూరిత నీరు తాగినా.. ఈ బ్యాక్టీరియా మనల్ని కాపాడుతుంది!

ఇయర్‌ బడ్స్‌ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే..

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement