whitest paint : ప్రపంచంలో ఇదే అతి తెల్లని పెయింట్..!
whitest paint : అమెరికా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతి తెల్లని పెయింట్‌ను తయారుచేశారు. ఈ పెయింట్ సూర్య కిరణాలను 95.5 శాతం వరకు...

కాలిఫోర్నియా : (whitest paint) అమెరికా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతి తెల్లని పెయింట్‌ను తయారుచేశారు. ఈ పెయింట్ సూర్య కిరణాలను 95.5 శాతం వరకు ప్రతిబింబిస్తుంది. గదిని చలువ చేయడంలో సహకరిస్తుంది. ఇది గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని తగ్గించడంలో కీలకంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని నాణ్యత కారణంగా ఈ పెయింట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.
అమెరికా పాడ్రూ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జియులిన్ రువాన్కు ఏడేండ్ల క్రితం వచ్చిన ఆలోచన మేరకు అతి తెలుపైన పెయింట్‌ను తయారు చేయడానికి నడుం బిగించాడు. ఇంధన పొదుపు, వాతావరణ మార్పు వంటి సమస్యలకు పరిష్కారంగా తెల్లటి పెయింట్ తయారీని రువాన్ బృందం ప్రారంభించింది. బేరియం సల్ఫేట్ అధికంగా వినియోగించి అతి తెల్లటి పెయింట్‌ను సిద్ధం చేశారు. దీనితో పెయింట్ చేసిన గోడపై 95.5 శాతం సూర్య కిరణాలను ప్రతిబింబిస్తుంది. ఈ పెయింట్ భవనం పైకప్పు, గోడలపై వేయడం ద్వారా వేసవి కాలంలో గదులను చల్లగా ఉండేలా చూసుకోవచ్చు. ఈ పెయింట్ గది ఉష్ణోగ్రతను 18 డిగ్రీల వరకు తగ్గిస్తుందని పరిశోధక బృందం తెలిపింది. ఈ పెయింట్ అందుబాటులోకి వస్తే ఖరీదైన ఎయిర్ కండీషనర్ల అవసరం ఉండదని వారు భావిస్తున్నారు.
ఈ పెయింట్ చౌకగా తయారవుతున్నందున సరసమైన ధరకు పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచడం సులభం అవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఎక్కువ కాలం మన్నే ఈ పెయింట్.. వాణిజ్య పెయింట్ కంటే చౌకగా, సులభంగా తయారుచేయవచ్చని రువాన్ చెప్పారు. నాణ్యత కారణాలతో దీని పేరును గిన్నీస్ రికార్డుల్లో నమోదు చేశారు. గదులకే కాకుండా కార్లు, టవర్లపై కూడా ఈ పెయింట్ వేసి చల్లబరుచుకోవచ్చు. అయితే, ఇది శీతాకాలంలో సమస్యలను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
బాధితురాలి బట్టలు ఉతకమని నిందితుడికి శిక్ష
కొవిడ్ మృతుల జ్ఞాపకార్ధం 6 లక్షల తెల్ల జెండాలు
గాంధీ-అంబేడ్కర్ మధ్య పుణె ఒప్పందం.. దళితులకు 2 ఓట్లు రద్దు
విషపూరిత నీరు తాగినా.. ఈ బ్యాక్టీరియా మనల్ని కాపాడుతుంది!
ఇయర్ బడ్స్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే..
ఇప్పుడిక చంద్రుడిపైకి పర్యాటక యాత్ర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

