Punishment : బాధితురాలి బట్టలు ఉతకమని నిందితుడికి శిక్ష
Punishment : లైంగికదాడికి యత్నించిన ఓ వ్యక్తికి బిహార్‌లోని స్థానిక కోర్టు ఒకటి విచిత్రమైన శిక్ష విధించింది. బాధితురాలి బట్టలు ఉతకాలని నిందితుడికి...

పాట్నా : (Punishment) లైంగికదాడికి యత్నించిన ఓ వ్యక్తికి బిహార్‌లోని స్థానిక కోర్టు ఒకటి విచిత్రమైన శిక్ష విధించింది. బాధితురాలి బట్టలు ఉతకాలని నిందితుడికి కోర్టు ఆదేశించింది. అలాగే గ్రామంలోని మహిళల దుస్తులను కూడా ఉచితంగా ఉతికి, ఇస్త్రీ చేసి ఇవ్వాలని షాకింగ్ పనిష్మెంట్ ఇచ్చింది. ఈ షరతుకు అంగీకరించడంతో నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పు బిహార్ అంతటా చర్చనీయాంశంగా మారింది.
లైంగికదాడికి యత్నం ఆరోపణలతో 20 ఏళ్ల యువకుడిని పోలీసులు గత ఏప్రిల్‌లో కస్టడీలోకి తీసుకుని కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. తప్పును అంగీకరించిన నిందితుడు.. తన వృత్తిపరమైన సామర్ధ్యంలో సమాజానికి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. నిందితుడు వాషర్మెన్ కమ్యూనిటీకి చెందిన వాడు కావడంతో కోర్టు అప్పటికప్పుడు విచిత్రమైన పనిష్మెంట్ను విధించింది. బాధితురాలితోపాటు గ్రామంలోని మహిళల దుస్తులను ఉచితంగా ఉతకాలని ఆదేశించింది. ఇందుకు అంగీకరించడంతో సదరు నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలల తర్వాత గ్రామ సర్పంచ్ నిందితుడి సేవపై ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుందని కూడా తెలిపారు.
ఝంజీర్‌పూర్ ఏడీజేగా ఉన్న అవినాష్ కుమార్.. గతంలో కూడా ఇలాంటి అనేక వింత తీర్పులను ప్రకటించినట్లు స్థానిక పత్రికల్లో వార్తలు వచ్చాయి. గత ఆగష్టులో లాక్డౌన్ సమయంలో పాఠశాలలు తెరవడంపై నమోదైన కేసులో గ్రామంలో పిల్లలకు ఉచితంగా బోధించాలని ఒక ఉపాధ్యాయుడిని ఆదేశించాడు.
ఇవి కూడా చదవండి..
కొవిడ్ మృతుల జ్ఞాపకార్ధం 6 లక్షల తెల్ల జెండాలు
గాంధీ-అంబేడ్కర్ మధ్య పుణె ఒప్పందం.. దళితులకు 2 ఓట్లు రద్దు
విషపూరిత నీరు తాగినా.. ఈ బ్యాక్టీరియా మనల్ని కాపాడుతుంది!
ఇయర్ బడ్స్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే..
ఇప్పుడిక చంద్రుడిపైకి పర్యాటక యాత్ర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

