Ear buds : ఇయర్ బడ్స్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే..
Ear buds : చిన్న బ్లూటూత్ హెడ్ఫోన్లు వైర్లెస్ ద్వారా మనకు ఎంతో సహాయపడుతున్నాయి. అయితే వీటి ద్వారా విడుదలయ్యే...

న్యూఢిల్లీ : (Ear buds) బ్లూటూత్ హెడ్ఫోన్లు ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్నాయి. మార్కెట్లో వివిధ రకాల్లో ఎయిర్‌పాడ్స్, ఇయర్‌బడ్స్, వైర్లెస్ నెక్‌బ్యాండ్స్ దొరుకుతున్నాయి. చిన్న బ్లూటూత్ హెడ్ఫోన్లు వైర్లెస్ ద్వారా మనకు ఎంతో సహాయపడుతున్నాయి. అయితే వీటి ద్వారా విడుదలయ్యే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం, బ్లూటూత్ ఇయర్‌బడ్స్ అధికంగా ఉపయోగించడం వల్ల మెదడు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయం బయోకెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ జెర్రీ ఫిలిప్స్ పరిశోధన ప్రకారం, బ్లూటూత్ లేదా వైర్లెస్ హెడ్‌ఫోన్స్ వాడకం వల్ల మెదడు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇయర్ బడ్స్ నుంచి వెలువడే తరంగాలు మెదడు కణజాలాన్ని దెబ్బతీస్తాయి. ఇయర్ బడ్స్ నుంచి వెలువడే విద్యుదయస్కాంత పౌనఃపున్యం మన శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. వైర్లెస్ హెడ్ఫోన్లను అధికంగా ఉపయోగించడం వల్ల జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. వీటి వల్ల చిన్నారులు, గర్భిణుల్లో కూడా ఎక్కువగా ప్రమాదం ఉన్నది.
అలాగే, న్యూరోలాజికల్ ఆరోగ్య సమస్యలు, జన్యుపరమైన రుగ్మతలు వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతుంది. చెవిపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. వినికిడి కోల్పోవడం, వినికిడి సమస్యలు వస్తాయి. చెవిలో ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్నది. టెటానస్తో పాటు తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి. జెర్రీ ఫిలిప్స్ పరిశోధనకు ముందు, వైర్లెస్ పరికరాల నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత క్షేత్రాలతో సంబంధమున్న ఆరోగ్య ప్రభావాల గురించి పరిశోధన జరుపాలని దాదాపు 42 దేశాలకు చెందిన 247 మంది శాస్త్రవేత్తలు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కు విజ్ఞప్తి చేశారు.
నివారణ ఎలా..?
ఆధునిక సాంకేతికత, అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ సాధనాలను పూర్తిగా పక్కన పెట్టడం సాధ్యం కాదు. అయితే, తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే ఈ విషయాలను గుర్తుంచుకోండి.
వైర్డ్ హెడ్ఫోన్లు, స్పీకర్లను ఎక్కువగా వినియోగించాలి.
10 ఇంచుల దూరంలో ఫోన్ పట్టుకుని మాట్లాడాలి.
ఉపయోగంలో లేనప్పుడు హ్యాండ్సెట్లు, ఫోన్లు, ఇతర గాడ్జెట్లను శరీరానికి దూరంగా ఉంచాలి.
దిండు కింద ఫోన్ పెట్టుకుని నిద్రపోకుండా చూసుకోవాలి.
వీడియోను చూడటానికి లేదా ఎక్కువసేపు ఆడియో వినడానికి స్పీకర్‌ని ఉపయోగించండి.
నిద్రపోతున్నప్పుడు ఫోన్, ఇతర గాడ్జెట్లను దూరంగా ఉంచాలి.
చౌవకైన ఇయర్ఫోన్లకు బదులుగా నాణ్యత గలవి వాడాలి.
ఒక రోజులో 60 నిమిషాల కంటే ఎక్కువ ఇయర్ఫోన్లు వాడకుండా చూసుకోవాలి.
ఇవి కూడా చదవండి..
కెప్టెన్‌కు షాకిస్తున్న సీఎం చన్నీ
ఇప్పుడిక చంద్రుడిపైకి పర్యాటక యాత్ర
ఎన్నికల కోసం రిచర్డ్ నిక్సన్ ‘చక్కర్’ ప్రసంగం
పడిపోయిన ఆర్-వ్యాల్యూ.. మందగించిన కొవిడ్ వ్యాప్తి
శ్రీరాముడి బస ఆధారంగా కొత్త టూరిజం సర్క్యూట్
వ్యాక్సిన్లపై యువకుడి వినూత్న ప్రమోషన్.. ఎక్కడంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

