Chhattisgarh: శ్రీరాముడి బస ఆధారంగా కొత్త టూరిజం సర్క్యూట్
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘రామ్ వన్ గమన్ టూరిజం సర్క్యూట్’ ప్రాజెక్ట్‌ను వచ్చే నెలలో ప్రారంభించనున్నది. అక్టోబర్ 7 న నవరాత్రి పండుగ...

రాయ్‌పూర్: (Chhattisgarh) ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘రామ్ వన్ గమన్ టూరిజం సర్క్యూట్’ ప్రాజెక్ట్‌ను వచ్చే నెలలో ప్రారంభించనున్నది. అక్టోబర్ 7 న నవరాత్రి పండుగ ప్రారంభాన్ని పురస్కరించుకుని ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. 2021 సంవత్సరానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలలో భాగంగా ఈ ప్రాజెక్టును తీసుకొస్తున్నారు. ‘బాత్ హై అభిమాన్ కీ, ఛత్తీస్‌గఢ్ కే స్వాభిమాన్ కీ’ అనే నినాదంతో ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ ప్రభుత్వం అభివృద్ధిని కొనసాగిస్తున్నది.
పురాణాల ప్రకారం, ప్రవాస జీవితంలో భాగంగా రాముడు, లక్ష్మణుడు, సీత.. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో నివసించారు. రాముడి స్ఫూర్తితో చత్తీస్‌గఢ్‌లో అనేక కథలు, పాటలు అందుబాటులో ఉన్నాయి. రాముడి నానిహాల్ (తల్లి జన్మస్థలం) అని ఛత్తీస్‌గఢ్ ప్రజలు గట్టిగా నమ్ముతారు. అలాగే, ఛత్తీస్‌గఢ్‌లో రాముడు యువరాజుగా మర్యాద పురుషోత్తముడిగా రూపాంతరం చెందాడని చెప్తుంటారు.
‘రాముడు అయోధ్య నుంచి వనవాసానికి వచ్చిన సమయంలో ఎక్కువ సమయం ఛత్తీస్‌గఢ్‌లో గడిపాడు. రాముడు, మాత కౌశల్యతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను కాపాడటానికి, భక్తులు, పర్యాటకులు ‘రామ్ వన్ గమన్’ టూరిజం సర్క్యూట్లో వేసే ప్రతి అడుగులోనూ దైవత్వం సారాంశాన్ని అనుభవించేలా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం రూపొందించింది’ అని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ చెప్పారు. రాయ్‌పూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్ఖురి గ్రామంలో ఉన్న పురాతన కౌసల్య మాత మందిరంలో సర్క్యూట్ ప్రారంభోత్సవం జరుగుతుంది. ప్రారంభ వేడుకలో సంగీతం, నృత్యం, లేజర్ షో, చత్తీస్‌గఢ్‌లో రాముడు, అతడి ప్రవాస కథను వర్ణించే ఎల్ఈడీ మ్యాపింగ్ తదితరాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.
ఇవి కూడా చదవండి..
పడిపోయిన ఆర్-వ్యాల్యూ.. మందగించిన కొవిడ్ వ్యాప్తి
వ్యాక్సిన్లపై యువకుడి వినూత్న ప్రమోషన్.. ఎక్కడంటే?
మెక్‌డోనాల్డ్స్ బర్గర్లో తేలు.. కేసు నమోదు
లక్షల మందిని బలిగొన్న ఇరాన్-ఇరాక్ యుద్ధానికి 41 ఏండ్లు
రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో బగ్.. గుర్తించిన 17 ఏండ్ల కుర్రోడు!
ఈ పాప.. తొలి ‘ఆన్లైన్ బేబీ’.. ఎలాగంటే?
తస్వీర్ స్క్రీనింగ్‌కు ఎంపికైన ‘నాను లేడీస్’.. కన్నడ లెస్బియన్ లవ్ స్టోరీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

