e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News Iran-Iraq war : లక్షల మందిని బలిగొన్న ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధానికి 41 ఏండ్లు

Iran-Iraq war : లక్షల మందిని బలిగొన్న ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధానికి 41 ఏండ్లు

(Iran-Iraq war) ఇరాన్‌పై ఇరాక్ 1980 లో సరిగ్గా ఇదే రోజున యుద్ధం ప్రకటించి దాడి చేసింది. ఈ యుద్ధం దాదాపు 8 ఏండ్ల పాటు కొనసాగింది. ఈ యుద్ధం మధ్యప్రాచ్యాన్ని అస్థిరం చేయడమే కాకుండా, రెండు దేశాలకు భారీ నష్టం కలిగించింది. ఈ యుద్ధంలో కెమికల్‌ ఆయుధాలు వినియోగించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ యుద్ధంలో 10 లక్షల మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తున్నది. వేలాది మంది గాయాలపాయ్యారు.

1979 లో ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవం రావడంతో అక్కడ ఆయతుల్లా ఖొమైనీ అధికారంలోకి వచ్చారు. పొరుగు దేశమైన ఇరాక్‌ అధినేతగా ఉన్న సద్దాం హుస్సేన్‌ క్రూర సున్నీ పాలకుడని, ఆయన తన దేశంలోని షియా సమాజాన్ని అణచివేస్తున్నరని ఖొమైనీ భావించేవారు. సద్దాం హుస్సేన్‌ను అధికార పీఠం నుంచి దించేయాలనే తన కోరికను కూడా చాలాసార్లు ఖొమైనీ బయటపెట్టాడు. ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవం కారణంగా తనకు ముప్పు ఉన్నది భావించి ఇరాక్‌ అధినేతగా ఉన్న సద్దాం హుస్సేన్‌ దాడికి కుట్రపన్నాడు. ఖొమైనీ నుంచి తనకు పెనుప్రమాదం ఎదురవ్వక ముందే ఇరాన్‌ను దారి తెచ్చుకోవాలనుకుని దాడికి దిగాడు. అయితే, షట్‌ అల్‌-అరబ్‌ కాలువపై వచ్చిన వివాదం కారణంగానే ఇరాన్‌పై దాడి చేయాల్సి వచ్చిందని ఇరాక్‌ పేర్కొంటుండటం విశేషం.

- Advertisement -

ఇరాన్‌పై రసాయన ఆయుధాలు ఉపయోగించిన ఇరాక్… జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఐక్యరాజ్య సమితి నిపుణులు ధ్రువీకరించారు. ఇరాక్ 1983 నుంచి మస్టర్డ్ గ్యాస్, 1985 నుంచి నెర్వ్ గ్యాస్ టబున్ ఉపయోగించినట్లు యూఎన్‌ తెలిపింది. ఈ యుద్ధంలో ఇరాన్‌కు ఇజ్రాయెల్ అండగా నిలిచి బాగ్దాద్‌ సమీపంలోని న్యూక్లియార్‌ రియాక్టర్‌పై బాంబుల వర్షం కురిపించింది. మరోవైపు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు యుద్ధం ముగిసేవరకూ ఇరాక్‌కు అండగా నిలిచాయి. సద్దాం హుస్సేన్ ప్రభుత్వంతో అమెరికా ‘ఇంటెలిజెన్స్ షేరింగ్’ కూడా చేసుకునేది. ఈ రోజు వరకు రెండు దేశాలు ఒకరినొకరు యుద్ధంపై నిందించుకుంటూనే ఉన్నాయి.

మరికొన్ని ముఖ్య సంఘటనలు..

2007: అంగారకుడిపై ఏడు గుహలాంటి బొమ్మలను కనుగొన్న నాసా విమానం

2006: అమెరికాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిన అట్లాంటిస్ స్పేస్‌క్రాఫ్ట్

1992: బోస్నియా-హెర్జెగోవినా మధ్య జరిగిన యుద్ధంలో యుగోస్లేవియాను బహిష్కరించిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ

1988: రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్, కెనడా పౌరులను నిర్బంధించినందుకు క్షమాపణలు చెప్పిన కెనడా

1966: చంద్రుని ఉపరితలంతో ఢీకొట్టిన అమెరికన్ అంతరిక్ష నౌక ‘సర్వేయర్ 2’

1949: మొదటి అణు బాంబును విజయవంతంగా పరీక్షించిన అప్పటి సోవియట్ యూనియన్‌

ఇవి కూడా చ‌ద‌వండి..

రైల్వే ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో బగ్‌.. గుర్తించిన 17 ఏండ్ల కుర్రోడు!

ఈ పాప.. తొలి ‘ఆన్‌లైన్‌ బేబీ’.. ఎలాగంటే?

తస్వీర్‌ స్క్రీనింగ్‌కు ఎంపికైన ‘నాను లేడీస్‌’.. కన్నడ లెస్బియన్‌ లవ్‌ స్టోరీ

వృద్ధులను వేధిస్తున్న మతిమరుపు సమస్య.. ఎందుకలా?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement