Revanth Reddy | తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి సగం స్పీచ్.. మిగతా ప్రసంగం బుక్‌లెట్‌లో చూడాలని సూచన!
Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలో నిలిపివేశారు. ఇంకా ఐదు పేజీల ప్రసంగం మిగిలి ఉన్నప్పటికీ ప్రసంగాన్ని ఆపేశారు.
Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలో నిలిపివేశారు. ఐదు పేజీల ప్రసంగం ఉండగా.. సగం స్పీచ్ మాత్రమే ఇచ్చారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున మొత్తం ప్రసంగాన్ని చేయడం లేదని ప్రకటించారు.
చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయని.. కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది.. అందుకే మిగతా విషయాలు రాతపూర్వకంగా ఇచ్చిన బుక్‌లెట్‌లో ఉంటుందని రేవంత్ రెడ్డి సూచించారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రసంగాన్ని సంక్షిప్తంగా పూర్తి చేస్తానని చెప్పారు. మిగతాదంతా రాతపూర్వకంగా రాష్ట్ర ప్రజలకు అందించామని తెలిపారు.
పరేడ్ గ్రౌండ్స్‌లో స్పీచ్ మధ్యలోనే ఆపేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కార్యక్రమాలు ఏర్పాటు
అయితే ఇంకా ఐదు పేజీల ప్రసంగం ఉండగానే ప్రసంగం ఆపేసిన రేవంత్ రెడ్డి
ఎండ చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ప్రసంగం మధ్యలో ఆపుతున్నట్లు… pic.twitter.com/PwpB4c4IE8
— Telugu Scribe (@TeluguScribe) June 2, 2026
సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తెలంగాణ వాదులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మొదటి నుంచి రేవంత్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకమేనని.. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆంధ్రాకు అనుకూలంగా, తెలంగాణకు వ్యతిరేకంగానే ఆయన పనిచేస్తున్నారని గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడటం ఇష్టం లేకనే.. ఎండల సాకు చెప్పి సగం ప్రసంగంతో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ముగించాడని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

