పాట్నా: బీహార్లోని బంకీపూర్ నియోజకవర్గం ఉపఎన్నిక కోసం గురువారం ఓటింగ్ ప్రారంభమైంది. అయితే తన మద్దతుదారులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసినట్లు తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. (Prashant Kishor) ఉపఎన్నికలో ఓటమి భయంతో అధికార బీజేపీ ఆదేశాల మేరకు పోలీసులు తన మద్దతుదారులలో చాలా మందిని అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. పాట్నాలోని జక్కన్పూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన ఆందోళన చేపట్టారు. అదుపులోకి తీసుకున్న 16 మందికిపైగా పార్టీ సభ్యుల ఆచూకీ చెప్పడానికి పోలీసులు నిరాకరించడంతో పోలీస్ అధికారి, ఆయన మధ్య వాగ్వాదం జరిగింది.
కాగా, ‘యూనిఫాం తీసివేస్తా, చూసుకుందామా’ అని ఎస్హెచ్వో తనను, తన మద్దతుదారులను బెదిరించారని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. తన మద్దతుదారులకు ఏమైనా జరిగితే ఆ అధికారి తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఉప ఎన్నిక ముగిసిన తర్వాత తప్పు చేసిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకునేలా మేము ఖచ్చితంగా ఒత్తిడి తెస్తామని మీడియాతో అన్నారు.
మరోవైపు బీజేపీ కంచుకోట అయిన బంకీపూర్ ఎమ్మెల్యే నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆయన రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. పోటీలో 26 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ యువజన విభాగం నాయకుడు నీరజ్ కుమార్ సిన్హా, ప్రశాంత్ కిషోర్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఆగస్ట్ 3న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
मेरे थाने में आकर हमको धमकायेंगे …वर्दी उतार दिए फिर ….? नेतागिरी कहीं और ..!
पटना पुलिस के SHO ने प्रशांत किशोर को कहा ..! #patnapolice #bankipur #prashantkishore pic.twitter.com/EqiWsoKSwI
— Mukesh singh (@Mukesh_Journo) July 30, 2026