హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ (ఈవెనింగ్ బీటెక్) ప్రవేశ పరీక్ష ఫలితాలు సోమవారం ఓయూ వీసీ కుమార్, ఈసెట్ కన్వీనర్ చంద్రశేఖర్ విడుదల చేశారు. 345మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 303 మంది పరీక్ష రాశారు. 291 అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.