Bab El Mandeb | ప్రపంచ నౌకా వాణిజ్యానికి మరో గండం.. మరో కీలక జలసంధిపై ఇరాన్ కన్ను
Bab El Mandeb | పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రస్థాయికి చేరాయి. లెబనాన్ (Labenon) లో ఇజ్రాయెల్ (Israel) సైనిక చర్యలకు ప్రతిగా కీలకమైన బాబ్ అల్-మందెబ్ (Bab El Mandeb) జలసంధిని అడ్డుకుంటామని ఇరాన్ (Iran) హెచ్చరించింది. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పై ఇప్పటికే ఉన్న ఆంక్షలతో సతమతమవుతున్న ప్రపంచ నౌకా వాణిజ్యానికి ఈ తాజా పరిణామం కొత్త ఆందోళనలు రేకెత్తిస్తోంది. జూన్ 1న ఇరాన్ ఈ హెచ్చరికలు జారీ చేసింది.
Bab El Mandeb : పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రస్థాయికి చేరాయి. లెబనాన్ (Labenon) లో ఇజ్రాయెల్ (Israel) సైనిక చర్యలకు ప్రతిగా కీలకమైన బాబ్ అల్-మందెబ్ (Bab El Mandeb) జలసంధిని అడ్డుకుంటామని ఇరాన్ (Iran) హెచ్చరించింది. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పై ఇప్పటికే ఉన్న ఆంక్షలతో సతమతమవుతున్న ప్రపంచ నౌకా వాణిజ్యానికి ఈ తాజా పరిణామం కొత్త ఆందోళనలు రేకెత్తిస్తోంది. జూన్ 1న ఇరాన్ ఈ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాతో పరోక్షంగా జరుపుతున్న చర్చలను నిలిపివేస్తున్నట్లు, బాబ్ అల్-మందెబ్ సహా పలు మార్గాల్లో ప్రతిఘటనను పూర్తిస్థాయిలో క్రియాశీలం చేయడంపై ఆలోచిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా పేర్కొన్నది.
దక్షిణ లెబనాన్‌లో పౌరులు, పారామెడిక్స్ మృతికి కారణమైన ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎర్ర సముద్రానికి దక్షిణ ప్రవేశ ద్వారంగా, యెమెన్, హార్న్ ఆఫ్ ఆఫ్రికా మధ్య బాబ్ అల్-మందెబ్ జలసంధి ఉంది. దీనిని ‘గేట్ ఆఫ్ టియర్స్’ అని కూడా పిలుస్తారు. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో దాదాపు 12-15 శాతం ఈ మార్గం గుండానే సాగుతుంది. ముఖ్యంగా సూయజ్ కాలువకు వెళ్లే నౌకలకు ఇది అత్యంత కీలకం. ఈ జలసంధిపై ఇరాన్‌కు ప్రత్యక్ష నియంత్రణ లేనప్పటికీ, యెమెన్‌లోని హౌతీల ద్వారా గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉంది.
లెబనాన్, గాజాలలో ఇజ్రాయెల్ చర్యలు కొనసాగితే, తమ ‘యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’ హర్మూజ్ తరహాలోనే బాబ్ అల్-మందెబ్‌లో కూడా నౌకా రవాణాను అడ్డుకుంటామని ఐఆర్జీసీ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఖానీ స్పష్టంచేశారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో జూన్ 1న అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 4 శాతానికిపైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 93 డాలర్లను దాటింది. మరోవైపు రాబోయే వారంలోగా హర్మూజ్ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఇరాన్‌తో కొత్త ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

