కీవ్: మిస్సైళ్లు, డ్రోన్లతో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మంగళవారం రాత్రి రష్యా దాడి(Russia Attack) చేసింది. కీవ్‌తో పాటు పలు నగరాలపై దాడులు జరిగాయి. ఆ దాడుల్లో సుమారు 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. బిల్డింగ్ శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 29 మంది గాయపడినట్లు సమాచారం ఉంది. కీవ్‌లో రెసిడెన్షియల్ బిల్డింగ్లు డ్యామేజ్ అయ్యాయి. కొన్ని పాక్షికంగా కూలిపోయాయి. దీంతో ఆ శిథిలాల్లో స్థానికులు చిక్కుకున్నారు. కీవ్‌లో అనేక జిల్లాలో ఆ దాడులు ప్రభావం చూపినట్లు సైనిక అధికారి తైముర్ తాచెంకో తెలిపారు. దిన్ప్రోలో అయిదుగురు మృతిచెందారు. అక్కడ 25 మంది గాయపడ్డారు. కీవ్‌లో నలుగురు మృతిచెందారు. 51 మంది గాయపడ్డారు. రెండు బహుళ అంతస్థుల భవనాలు దెబ్బతిన్నాయని కీవ్ మేయర్ విటాలీ క్లిచ్కోవ్ తెలిపారు.
తెల్లవారుజాము వరకు కీవ్‌పై రష్యా దాడులు కొనసాగించింది. డ్రోన్ల శబ్ధం భారీగా వినిపించింది. డజన్ల సంఖ్యలో భారీగా డ్రోన్ల పేలుళ్లు జరిగాయి. ఓ గ్యాస్ స్టేషన్ వద్ద భారీగా నిప్పులు అంటుకున్నాయి. ఓ నిర్మాణ కేంద్రం, అనేక అపార్ట్మెంట్ బ్లాకులు డ్యామేజ్ అయ్యాయి. జపోరిజియాలో ఉన్న పారిశ్రామిక కేంద్రంపై కూడా దాడి జరిగింది. రష్యా భారీగా దాడి చేసే అవకాశాలు ఉన్నట్లు సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వార్నింగ్ ఇచ్చిన 24 గంటల్లోనే అటాక్ జరిగింది. మిలిటరీతో పాటు కీవ్‌లోని కీలక కేంద్రాలను టార్గెట్ చేయనున్నట్లు గత వారం రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే.