First e-Baby : ఈ పాప.. తొలి ‘ఆన్లైన్ బేబీ’.. ఎలాగంటే?
First e-Baby : ఇంగ్లండ్‌కు చెందిన ఓ మహిళ మాత్రం.. వైద్యుల పర్యవేక్షణ వారి సలహాలు సూచనలేమాత్రం తీసుకోకుండా ఈ-బేబీని కన్నది. వైద్య చరిత్రలో ఈ ఈ-బేబీ చిరస్థాయిగా నిలిచిపోనున్నది...

లండన్ : పిల్లలు పుట్టని వారికి కృత్రిమ గర్భదారణ వరంగా మారింది. అదేవిధంగా అద్దె గర్భాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు విధానాల్లో వైద్యుల పాత్ర ఎంతో ఉంటుంది. వారి పర్యవేక్షణలోనే కృత్రిమ గర్భదారణగానీ, సరోగసీగానీ జరుగుతుంటాయి. అయితే, ఇంగ్లండ్‌కు చెందిన ఓ మహిళ మాత్రం.. వైద్యుల పర్యవేక్షణ వారి సలహాలు సూచనలేమాత్రం తీసుకోకుండా ఈ-బేబీని కన్నది. వైద్య చరిత్రలో ఈ ఈ-బేబీ (First e-Baby) చిరస్థాయిగా నిలిచిపోనున్నది.
ఇంగ్లండ్‌లోని నార్త్ యార్క్‌షైర్‌లోని నంటోర్ప్ టీసైడ్కు చెందిన స్టెఫెనీ టేలర్.. ఐదేండ్ల క్రితం ఒక కుమారుడికి జన్మనిచ్చింది. భర్తతో విడివడిన అనంతరం మరో పిల్లాడ్ని కనాలని భావించింది. దీని కోసం ఇంటర్నెట్లో శోధించింది. ప్రైవేట్ ఫెర్టిలిటీ క్లినిక్‌ల వివరాలను సేకరించింది. అయితే, రెండో బిడ్డను కనేందుకు ఖర్చు ఎక్కువవున్నందున ఆ ప్రణాళికను విరమించుకోవాలని భావించింది. ఇంతలో డేటింగ్ టిండర్ యాప్‌లాంటి ‘జస్ట్ ఏ బేబీ’ యాప్ గురించి స్నేహితుడి ద్వారా తెలుసుకున్న స్టెఫెనీ టేలర్.. వారిని సంప్రదించి ఎలాంటి అనారోగ్య చరిత్ర లేని వ్యక్తికి చెందిన వీర్యాన్ని పంపాల్సిందిగా ఆన్లైన్ ఆర్డర్ చేసింది. ఈబే నుంచి ఇన్సెమినేషన్ కిట్‌ను కొనుగోలు చేసింది.
రెండు వారాల పాటు యాప్‌లో సమాచారం ఇచ్చిపుచ్చుకున్న తర్వాత ఒకరు తన వీర్యం ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. 2020 జనవరి లో స్టెఫెనీ టేలర్‌కు వీర్యం అందింది. యూట్యూబ్‌లో గర్భదారణకు సంబంధించిన సమాచారాన్ని చదివి ఇన్సెమినేషన్ కిట్ ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నది. అందులో చెప్పినట్లుగా పాటించి విజయవంతంగా గర్భం దాల్చి పండంటి పాపకు జన్మనిచ్చింది. ఎలక్ట్రానిక్ యుగంలో ఎలక్ట్రానిక్‌గానే తాను అమ్మను కావడం సంతోషకరంగా ఉందన్నారు. ఆన్లైన్లో అందిన స్పెర్మ్‌తో బేబీని కనడం ఓ అద్భుతం అని, వైద్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మా పాప నిజమైన ‘ఆన్లైన్ బేబీ’ అని టేలర్ అభివర్ణించింది. పాప పుట్టిన విషయాన్ని వీర్యదాతతో పంచుకున్నది. చిన్నారికి ఈడెన్ అని పేరు పెట్టి తన ఐదేండ్ల కొడుకుతో పాటు ఆప్యాయంగా పెంచుతున్నది.
ఇవి కూడా చదవండి..
మతపరమైన నిర్మాణాల రక్షణ బిల్లును తెచ్చిన కర్నాటక
శరద్ పవార్ వెన్నుపోటుదారు: అనంత్ గీతే
జలాలాబాద్‌లో 35 మంది తాలిబాన్లు మృతి : ఐసిస్ ఖోరాసన్
పాక్‌లో సివిల్స్‌కు ఎంపికైన హిందూ యువతి
వృద్ధులను వేధిస్తున్న మతిమరుపు సమస్య.. ఎందుకలా?
2-3-4 ఫార్ములాతో బీపీ కంట్రోల్.. ఎలాగంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

