ISIS Khorasan: జలాలాబాద్‌లో 35 మంది తాలిబాన్లు మృతి : ఐసిస్ ఖోరాసన్
ISIS Khorasan : కాబూల్ విమానాశ్రయంపై దాడి చేసిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఖోరాసన్ గ్రూప్.. శని, ఆదివారాల్లో జలాలాబాద్‌లో రెండు ఆత్మాహుతి దాడులకు పాల్పడినట్లు ప్రకటించింది. ఈ దాడుల్లో...

కాబూల్ : తుపాకీని ఎక్కుపెట్టి ఆఫ్ఘనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబాన్ ఇప్పుడు.. దాని భాషలోనే సమాధానం పొందుతున్నది. కాబూల్ విమానాశ్రయంపై దాడి చేసిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఖోరాసన్ గ్రూప్ (ISIS Khorasan) .. శని, ఆదివారాల్లో జలాలాబాద్‌లో రెండు ఆత్మాహుతి దాడులకు పాల్పడినట్లు ప్రకటించింది. ఈ దాడుల్లో మొత్తం 35 మంది తాలిబాన్లు మరణించారని, మరో 12 మంది గాయపడ్డట్లు తెలిపింది. వారికి చెందిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నది. గత నెలాఖరులో ఇదే బృందం కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఆత్మాహుతి దాడికి పాల్పడింది. భవిష్యత్‌లో తాలిబాన్‌ను లక్ష్యంగా చేసుకుంటామని ఆ సంస్థ బెదిరించింది. ఐసిస్-కే గ్రూప్ వాదనపై తాలిబాన్ ఇంకా స్పందించలేదు.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌కు ఐసిస్ ఖోరాసన్ గ్రూపు పెద్ద సవాలుగా మారుతున్నది. కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాతే ఖోరాసన్ గ్రూప్, తాలిబాన్‌కు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించింది. తాలిబాన్ తమ షరతులను అంగీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు, ఖోరాసన్ గ్రూపు చర్యలను పర్యవేక్షిస్తున్నామని, తగిన సమాధానం ఇస్తామని తాలిబాన్ పేర్కొన్నది. విమానాశ్రయంపై దాడి తర్వాత, తాలిబాన్ తమ ప్రత్యేక బృందమైన బద్రి-313 కి ఇక్కడి భద్రతను అప్పగించింది. అప్పటి నుంచి ఖోరాసన్ గ్రూప్.. తాలిబాన్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లుగా తెలుస్తున్నది. జలాలాబాద్‌లో ఆత్మహత్యాదాడులు జరిగి రెండు రోజులవుతున్నా.. తాలిబాన్ ప్రతినిధులు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం విశేషం.
ఇవి కూడా చదవండి..
పాక్‌లో సివిల్స్‌కు ఎంపికైన హిందూ యువతి
వృద్ధులను వేధిస్తున్న మతిమరుపు సమస్య.. ఎందుకలా?
ఛార్జ్‌ల ద్వారా 170 కోట్లు సంపాదించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్
2-3-4 ఫార్ములాతో బీపీ కంట్రోల్.. ఎలాగంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

