e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News Anant Geete : శరద్‌ పవార్‌ వెన్నుపోటుదారు: అనంత్‌ గీతే

Anant Geete : శరద్‌ పవార్‌ వెన్నుపోటుదారు: అనంత్‌ గీతే

ముంబై : శరద్‌ పవార్‌పై రాయగడ మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంత్ గీతే (Anant Geete) పలు విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు ఆయన వెన్నుపోటు పొడిచి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి శివసైనికులకు ఏనాటికీ గురువు కాలేరన్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న మహా వికాస్‌ అఘాది ప్రభుత్వం ‘సర్దుబాటు’ మాత్రమే అని అనంత్‌ గీతే బాంబు పేల్చారు. రాయగడలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

శివసేన-బీజేపీ మధ్య విభేదాల తర్వాత 2019 లో మహా వికాస్‌ అఘాది ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతకుముందు బీజేపీతో కలిసి శివసేన అధికారాన్ని పంచుకున్నది. ‘ఇప్పుడున్న ప్రభుత్వం సర్దుబాటు మాత్రమే. అయినందున శరద్ పవార్ మా నాయకుడు కాలేడు. మా గురువు ఎప్పటికీ బాలాసాహెబ్ ఠాక్రేనే’ అని చెప్పారు. ఈ ప్రభుత్వం పనిచేస్తున్నంత కాలం మూడు పార్టీల మధ్య సర్దుబాటు కొనసాగుతుందని తెలిపారు. సేన నేతృత్వంలోని ప్రభుత్వంపై తనకు ఎలాంటి దురుద్దేశాలు లేవని, ఈ ప్రభుత్వం విజయవంతం అవుతుందని అనంత్‌ గీతే పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థి సునీల్‌ తత్కరే చేతిలో స్వల్ప తేడాతో అనంత్‌ గీతే ఓటమిపాలయ్యారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

- Advertisement -

జలాలాబాద్‌లో 35 మంది తాలిబాన్లు మృతి : ఐసిస్‌ ఖోరాసన్

పాక్‌లో సివిల్స్‌కు ఎంపికైన హిందూ యువతి

వృద్ధులను వేధిస్తున్న మతిమరుపు సమస్య.. ఎందుకలా?

2-3-4 ఫార్ములాతో బీపీ కంట్రోల్‌.. ఎలాగంటే?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement