Vaccine Promotion : వ్యాక్సిన్లపై యువకుడి వినూత్న ప్రమోషన్.. ఎక్కడంటే?
Vaccine Promotion : ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించేందుకు గుజరాత్లో ఓ యువకుడు వినూత్న ప్రమోషన్ చేపట్టాడు. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుని.. వ్యాక్సిన్ ...

(Vaccine Promotion) కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు కేంద్రం వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చింది. అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్లను విరివిగా అందజేస్తున్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లలో వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కూడా వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అనుకున్నంత లక్ష్యానికి చేరుకోవడం లేదు. ప్రభుత్వాలు ఎంతగా వేడుకుంటున్నా ప్రజలు అలసత్వం వీడటం లేదు.
ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించేందుకు గుజరాత్లో ఓ యువకుడు వినూత్న ప్రమోషన్ చేపట్టాడు. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుని.. వ్యాక్సిన్ వ్యాక్సిన్ అంటూ కూరగాయలు అమ్మినట్లుగా పెద్దగా అరుస్తున్నాడు. మొదటి డోసైనా, రెండోదైనా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే.. భయ్యా మీరు వ్యాక్సిన్ తీసుకోలేదా అయితే వెంటనే తీసుకోండి అంటూ వారిని మోటివేట్ చేస్తూ ఆకర్శిస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫన్నీ వీడియోకు ఇప్పటివరకు 25,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. నిద్రపోతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని తాపత్రయపడిపోతున్న ఈ యువకుడికి హాట్స్ ఆఫ్ అంటూ ఒక నెటిజెన్ ప్రశంసించాడు.
ఇవి కూడా చదవండి..
మెక్‌డోనాల్డ్స్ బర్గర్లో తేలు.. కేసు నమోదు
లక్షల మందిని బలిగొన్న ఇరాన్-ఇరాక్ యుద్ధానికి 41 ఏండ్లు
రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో బగ్.. గుర్తించిన 17 ఏండ్ల కుర్రోడు!
ఈ పాప.. తొలి ‘ఆన్లైన్ బేబీ’.. ఎలాగంటే?
తస్వీర్ స్క్రీనింగ్‌కు ఎంపికైన ‘నాను లేడీస్’.. కన్నడ లెస్బియన్ లవ్ స్టోరీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

