Saving Bacteria : విషపూరిత నీరు తాగినా.. ఈ బ్యాక్టీరియా మనల్ని కాపాడుతుంది!
Saving Bacteria : అన్ని బ్యాక్టీరియాలు హానికరం కాదనే విషయం మనం మరిచిపోతున్నాం. విషపూరితాలు ఉన్న నీటిని తాగినా మనల్ని ఒక రకం బ్యాక్టీరియా కాపాడుతున్నది. ఈ బ్యాక్టీరియాలు నీటిలోని విషపూరితాలను తినేయడం ద్వారా మనకు మంచి...

(Saving Bacteria) అన్ని బ్యాక్టీరియాలు హానికరం కాదనే విషయం మనం మరిచిపోతున్నాం. విషపూరితాలు ఉన్న నీటిని తాగినా మనల్ని ఒక రకం బ్యాక్టీరియా కాపాడుతున్నది. ఈ బ్యాక్టీరియాలు నీటిలోని విషపూరితాలను తినేయడం ద్వారా మనకు మంచి చేస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం అంతర్జాతీయ ‘జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కెమికల్ ఇంజినీరింగ్’ లో ప్రచురితమైంది.
ఈ తాజా అధ్యయనం ప్రకారం, కొన్ని బ్యాక్టీరియా నీటిలోని విష లోహాలను తినేస్తాయి. ఈ బ్యాక్టీరియాకు ‘మైక్రోబాక్టీరియం పారాక్సిడాన్స్ స్ట్రెయిన్ వీఎస్వీఎం ఐఐటీ (బీహెచ్‌యూ)’ అని పేరు పెట్టారు. ఈ బ్యాక్టీరియా నీటిని మానవులకు సురక్షితంగా త్రాగడానికి చేస్తుందని కనుగొన్నారు. డాక్టర్ విశాల్ మిశ్రా, పీహెచ్డీ విద్యార్థి వీర్ సింగ్ – ఈ బ్యాక్టీరియా అత్యంత కలుషితమైన పారిశ్రామిక నీటి నుంచి కూడా విషాన్ని తొలగించగలదని గుర్తించారు. మురికినీటి నుంచి విషపూరిత హెవీ మెటల్ హెక్సావాలెంట్ క్రోమియంను ఈ బ్యాక్టీరియా వేరు చేస్తుంది. బాక్టీరియల్ ఐసోలేట్ 200 mg/L Cr (VI) వరకు తట్టుకోగలదు. 50 mg/L Cr (VI) లో పెరిగినప్పుడు గరిష్టంగా 99.96 శాతం విషాల తొలగింపు సామర్థ్యాన్ని చూపించినట్లు శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో పేర్కొన్నారు.
హెక్సావాలెంట్ క్రోమియం ఉన్న నీటిని వినియోగించడం ద్వారా మనుషుల్లో వివిధ రకాల క్యాన్సర్లు, వంధ్యత్వం, కాలేయ వ్యాధులు, మూత్రపిండాల సమస్యలను కలిగిస్తుంది. హెక్సావాలెంట్ క్రోమియం అధిక సాంద్రతలను మైక్రోబాక్టీరియం పరాక్సిడాన్స్ స్ట్రెయిన్ తట్టుకోగలదు. ఇది సంప్రదాయ పద్ధతులతో పోల్చినప్పుడు వ్యర్థజలాల నుంచి విషపూరిత పదార్థాలను తొలగించడంలో అత్యంత ప్రభావవంతమైనదని పరిశోధకులు భావిస్తున్నారు. హెక్సావాలెంట్ క్రోమియంను తొలగించే ఈ పద్ధతి చాలా ఖర్చుతో కూడుకున్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి..
డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌లో భారత్‌కు 59వ స్థానం
ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్న గవర్నర్లు : శివసేన
పంజాబ్‌లో తప్పిన భారీ ఉగ్రదాడి, ముగ్గురు అరెస్ట్
కోవలం, ఈడెన్ బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్.. ఎందుకో తెలుసా?
ఐఆర్సీటీసీ ‘లేహ్-లడఖ్’ పర్యాటక ప్యాకేజీ సిద్ధం..
ఇయర్ బడ్స్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే..
కెప్టెన్‌కు షాకిస్తున్న సీఎం చన్నీ
ఇప్పుడిక చంద్రుడిపైకి పర్యాటక యాత్ర
ఎన్నికల కోసం రిచర్డ్ నిక్సన్ ‘చక్కర్’ ప్రసంగం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

