న్యూఢిల్లీ : (Leh-Ladakh) లడఖ్-లేహ్ ప్రాంతాలను వీక్షించాలనుకునే వారి కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్యాకేజీలో భాగంగా పలు హాలిడే డెస్టినేషన్లు కూడా ఉన్నాయి. 8 రోజులు, 7 రాత్రులుగా ఉండే ఈ ప్యాకేజీలో తీసుకెళ్లే పర్యాటకులకు రైలుతో పాటు విమానాన్ని కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఈ ప్యాకేజీ పర్యటన ఈ నెల 26 న ప్రారంభమై వచ్చే నెల 3 న ముగుస్తుంది.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) లేహ్-లడఖ్ ప్రత్యేక ప్యాకేజీని ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ ప్రజల డిమాండ్‌పై ఈ ప్యాకేజీని తీసుకొచ్చారు. 8 రోజులు, 7 రాత్రుల టూర్ ప్యాకేజీ.. రైలు, విమానం ద్వారా ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ఈ నెల 26 నుంచి ప్రారంభమై అక్టోబర్ 3 న ముగుస్తుంది. ప్యాకేజీని ఎంచుకునే వారు.. లక్నో నుంచి ఢిల్లీకి తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో చేరుకొని, ఆపై ఢిల్లీ నుంచి లేహ్‌కు విమానంలో ప్రయాణిస్తారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందించే త్రీ-స్టార్ హోటళ్లలో ఆహారం, బస ఏర్పాట్లు చేస్తున్నారు.
లేహ్, లడఖ్ చేరుకున్న తర్వాత పర్యాటకులను లోయలోని ప్రముఖ హాలిడే డెస్టినేషన్స్.. బౌద్ధ స్థూపం, మఠం దర్శనం, లేహ్ ప్యాలెస్, శాంతి స్థూపం, గురుద్వారాలకు కూడా తీసుకెళ్తారు. వీటిలో. డిస్కిట్, హండర్, తుర్తుక్ గ్రామాలకు కూడా పర్యాటకులను తీసుకెళ్తారు. టూర్ ప్యాకేజీలో భాగంగా నుబ్రా వ్యాలీలో అడ్వెంచర్ క్యాంప్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ సందర్శకులు రాత్రిపూట బస చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ టూర్ ప్యాకేజీ కావాలనుకునే జంట.. బుకింగ్ కోసం ప్రతి వ్యక్తికి రూ.38,600, మూడో బుకింగ్ కోసం రూ.37,700 చెల్లించాల్సి ఉంటుంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ www.irctctourism.com లో ప్యాకేజీ బుకింగ్ చేసుకోవచ్చు. వీటితోపాటు దేశీయ, విదేశీ పర్యటనలను కూడా ఐఆర్సీటీసీ అందిస్తున్నది. దక్షిణ భారత పర్యటన ప్యాకేజీ ‘దక్షిణ దర్శన్’ రైల్ టూర్ ప్యాకేజీని ఈ నెల మొదట్లో ఐఆర్సీటీసీ ప్రారంభించింది. ప్యాకేజీ ధర ఒక్కో వ్యక్తికి రూ.9,450 నుంచి మొదలవుతుంది.
ఇయర్ బడ్స్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే..
కెప్టెన్‌కు షాకిస్తున్న సీఎం చన్నీ
ఇప్పుడిక చంద్రుడిపైకి పర్యాటక యాత్ర
ఎన్నికల కోసం రిచర్డ్ నిక్సన్ ‘చక్కర్’ ప్రసంగం
పడిపోయిన ఆర్-వ్యాల్యూ.. మందగించిన కొవిడ్ వ్యాప్తి
వ్యాక్సిన్లపై యువకుడి వినూత్న ప్రమోషన్.. ఎక్కడంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..