Punjab : పంజాబ్‌లో తప్పిన భారీ ఉగ్రదాడి, ముగ్గురు అరెస్ట్
Punjab : పంజాబ్ పోలీసులు భారీ ఉగ్ర దాడి జరుగకుండా నివారించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని...

అమృత్సర్: (Punjab) పంజాబ్ పోలీసులు భారీ ఉగ్ర దాడి జరుగకుండా నివారించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తరణ్ తరణ్ జిల్లాలో పెద్ద ఉగ్రదాడి జరిపేందుకు ఈ ముగ్గురు ప్రణాళిక వేసినట్లు పోలీసులు గుర్తించారు.
పంజాబ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ఉగ్రదాడి తప్పింది. బుధవారం అర్థరాత్రి కారులో వచ్చిన ముగ్గురు దుండగులను తరణ్ తరణ్ జిల్లాలోని భగవాన్ పురా గ్రామం దగ్గర చుట్టుముట్టారు. వారి వద్ద .9 మిమీ పిస్టల్, 11 లైవ్ కాట్రిడ్జ్‌లు, హ్యాండ్ గ్రెనేడ్, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత వ్యక్తులను ఇదే రాష్ట్రంలోని మోగా జిల్లాకు చెందిన కమల్‌ప్రీత్ సింగ్ మన్, కుల్విందర్ సింగ్, కన్వర్ పాల్ సింగ్‌గా గుర్తించారు. ఈ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టి ఇంకా సెర్చ్ చేస్తున్నారు.
ఈ నెల మొదట్లో పంజాబ్‌లోని ఇండో-పాక్ సరిహద్దు నుంచి ‘టిఫిన్ బాక్స్ ఐఈడీ’ స్వాధీనం చేసుకున్నారు. ఆగస్ట్ నెల ఆరంభంలో అమృత్సర్ రూరల్ పోలీసులు లోపోకేలోని దలేకే గ్రామం నుంచి ఐదు హ్యాండ్ గ్రెనేడ్లు, టిఫిన్ బాక్స్ ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో అనేక పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం భద్రతా హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాలైన బియాస్, నంగల్, బటాలా, తరణ్ తరణ్‌తో పాటు అనేక చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
కోవలం, ఈడెన్ బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్.. ఎందుకో తెలుసా?
ఐఆర్సీటీసీ ‘లేహ్-లడఖ్’ పర్యాటక ప్యాకేజీ సిద్ధం..
ఇయర్ బడ్స్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే..
కెప్టెన్‌కు షాకిస్తున్న సీఎం చన్నీ
ఇప్పుడిక చంద్రుడిపైకి పర్యాటక యాత్ర
ఎన్నికల కోసం రిచర్డ్ నిక్సన్ ‘చక్కర్’ ప్రసంగం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

