Puja Pandal | దసరా అంటే ముందుగా గుర్తొచ్చేది పశ్చిమ బెంగాల్ రాష్ట్రమే. ఎందుకంటే అక్కడ నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. రకరకాల మండపాలను (Puja Pandal) ఏర్పాటు చేసి తొమ్మిది రోజులపాటూ దుర్గామాతకు పూజలు నిర్వహిస్తారు. అయితే, ఈ ఏడాది హుగ్లీ (Hooghly) జిల్లాలో ఏర్పాటు చేసిన పూజ పండల్ వివాదానికి దారితీసింది.
ఈ ఏడాది అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India crash) సంభవించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ ఫ్లైట్ టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఓ బిల్డింగ్‌పై కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో బిల్డింగ్‌పై విమాన తోకభాగం ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. ఇదే థీమ్‌తో దుర్గామాత మండపాన్ని ఏర్పాటు చేశారు. మంటల్లో విమానం ఉన్నట్లు దాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్గామాత పూజకు ఇలాంటి మండపాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే, నిర్వాహకులు మాత్రం విషాద సమయంలో బాధితులకు, రెస్యూ సిబ్బందికి నివాళిగా దీన్ని రూపొందించినట్లు చెబుతున్నారు.
A Durga Puja pandal in West Bengal’s Hooghly district has triggered widespread outrage after unveiling a theme that many consider highly insensitive.
The installation, crafted with intricate detail, portrays the aftermath of the recent Air India Boeing 787 Dreamliner tragedy.… pic.twitter.com/p5gcJemzcT
— The Sentinel (@Sentinel_Assam) October 6, 2025
Also Read..
CJI | షాకింగ్.. సీజేఐ గవాయ్‌పై షూ విసిరేందుకు యత్నించిన లాయర్
Woman Bartender: పిల్లోడిని ఎత్తుకుని ఫైర్ బాటిళ్లతో మహిళా బార్టెండర్ విన్యాసాలు.. వీడియో