పుణె: మహారాష్ట్రలోని పుణెకి చెందిన మహిళా బార్టెండర్(Woman Bartender) కవిత మెదార్ వివాదంలో చిక్కుకున్నది. చిన్న పిల్లోడిని ఎత్తుకుని ఆమె ఫైర్ బాటిళ్లతో బార్టెండర్ విన్యాసాలు చేపట్టింది.దుర్గానవరాత్రుల సమయంలో జరిగిన ఓ ఈవెంట్లో ఆమె ఈ స్టంట్ చేసింది. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కొందరు ఆమె సాహసాన్ని మెచ్చుకోగా, మరికొందరు ఆమె వ్యవహరించిన తీరును ఖండించారు. చంకలో పిల్లోడు ఉన్న సమయంలో.. ఫైర్ బాటిళ్లతో ఆటలేంటని కొందరు ప్రశ్నించారు.
అయితే కవిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన బాటిల్ స్కిల్స్‌కు చెందిన వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోకు ఇప్పటికే 3 కోట్ల వ్యూస్ వచ్చాయి. నవరాత్రి స్పెషల్ అని తన వీడియోకు ట్యాగ్‌లైన్ ఇచ్చిందామె. సంప్రదాయ దుస్తుల్లో డ్యాన్స్ చేస్తూ.. ఎడమ చేయి వైపు పిల్లోడిని ఎత్తుకుని, కుడి చేతితో ఫైర్ బాటిళ్ల విన్యాసాలను ప్రదర్శించింది. ఆ ఈవెంట్లో బార్టెండర్ కవిత విన్యాసాలను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు.
బార్టెండర్ కవిత స్వస్థలం కర్నాటకలోని ఓ గ్రామం. తన కుటుంబ పోషణ కోసం ఆమె బార్టెండర్గా చేస్తున్నది. అయితే ఫైర్ బాటిళ్లతో విన్యాసాలు చేస్తూ ఆమె ఫేమస్ అయ్యింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2021లో ఆమెకు గుర్తింపు దక్కింది. 2022లో ఇండియాస్ గాట్ ట్యాలెంట్ షోలో కూడా ఆమె ఫెవరేట్‌గా నిలిచింది.