CJI | దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్ (CJI BR Gavai)పై ఓ లాయర్ దాడికి యత్నించారు. సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో కోర్టు (courtroom) కార్యకలాపాలు జరుగుతుండగా సీజేఐపై ఓ లాయర్ షూ విసిరేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సదరు లాయర్‌ను అడ్డుకుని బయటకు తీసుకెళ్లారు.
సోమవారం ఉదయం ఓ కేసు విచారణ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. విచారణ సమయంలో డయాస్ వద్దకు వెళ్లిన సదరు లాయర్.. షూ తీసి సీజేఐపైకి విసిరేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది లాయర్ని అడ్డుకుని బయటకి లాక్కెళ్లారు.అనంతరం పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలో ఆ న్యాయవాది ‘సనాతనానికి జరిగే అవమానాన్ని మేము సహించము..’ అంటూ గట్టిగా అరిచారు. ఈ ఘటనతో కోర్టులో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. స్పందించిన సీజేఐ ఈ విషయాన్ని తనని ప్రభావితం చేయదని పేర్కొన్నారు. మిగతా లాయర్లు తమ వాదనలు కొనసాగించాలని ఆదేశించారు.
Also Read..
Donald Trump | అలా చేయకపోతే భారీ రక్తపాతమే.. ఇజ్రాయెల్, హమాస్‌కు ట్రంప్ కీలక హెచ్చరికలు
Delhi Metro | ఢిల్లీ మెట్రోలో ఘర్షణ.. రెజ్లింగ్ తరహాలో కొట్టుకున్న ప్రయాణికులు.. VIDEO