Donald Trump | గాజా విషయంలో (Gaza Plan) ఇజ్రాయెల్ (Israel), హమాస్ (Hamas)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గాజా శాంతి ప్రణాళిక విషయంలో వెంటనే ఒక నిర్ణయానికి రాకపోతే భారీ రక్తపాతం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈజిప్టు వేదికగా ఇరు పక్షాల మధ్య కీలక చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ హెచ్చరికలు చేశారు.
‘శతాబ్దాల నాటి ఈ సంఘర్షణను నేను నిశితంగా గమనిస్తున్నానే ఉన్నాను. సమయం చాలా విలువైంది. గాజా శాంతి ప్రణాళికపై ఇజ్రాయెల్, హమాస్ త్వరగా ముందుకు సాగాలి. అలా చేయడంలో విఫలమైతే భారీ రక్తపాతం జరుగుతుంది (Massive Bloodshed Will Follow)’ అంటూ ట్రూత్‌లో పోస్టు పెట్టారు. హమాస్‌తో పాటు ఇతర అరబ్, ముస్లిం దేశాలతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, బందీల విడుదల, గాజాలో యుద్ధం ముగింపు వంటి అంశాలపై సానుకూల వాతావరణం నెలకొందని ఈ సందర్భంగా ట్రంప్ తెలిపారు. నేడు ఈజిప్టు వేదికగా తుది చర్చలు జరగనున్నట్లు వెల్లడించారు.
అంతకుముందు తొలి దశలో భాగంగా గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని హమాస్‌కు కూడా పంపించినట్లు ఆయన తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా శనివారం వెల్లడించారు. హమాస్ నుంచి ఆమోదం లభించిన వెంటనే గాజాలో కాల్పుల విరమణ అమలులోకి వస్తుందని, ఇజ్రాయెలీ బందీలు, పాలస్తీనా బందీల మార్పిడి ప్రారంభమవుతుందని ట్రంప్ తెలిపారు. తొలి దశ ఉపసంహరణకు పరిస్థితులను సానుకూలం చేస్తామని, దీంతో 3,000 సంవత్సరాల పాలస్తీనా సంక్షోభానికి ముగింపు లభించగలదని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read..
బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకారం: ట్రంప్
Israel | ట్రంప్ సూచనలు బేఖాతరు.. గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఆరుగురు మృతి
Mount Everest | మౌంట్ ఎవరెస్ట్‌పై మంచు తుఫాను బీభత్సం.. చిక్కుకుపోయిన 1,000 మంది ట్రెక్కర్స్