Mount Everest | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ (Mount Everest)పై మంచు తుఫాను (Snowstorm) బీభత్సం సృష్టించింది. సుమారు 1,000 మంది పర్వతారోహకులు (trekkers) వేల అడుగుల ఎత్తులో ఈ తుఫానులో చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపడుతున్నాయి.
టిబెట్ (Tibet)లో ఎవరెస్ట్ పర్వతం (Mount Everest) తూర్పువాలు వైపు రెండు రోజుల క్రితం నుంచి విపరీతంగా మంచు పడుతోంది. అది ఆదివారం నాటికి తుఫానుగా మారిపోయింది. ఈ ప్రభావంతో కర్మా వ్యాలీ, కాంగ్షుంగ్ వైపు ట్రెక్కింగ్ చేస్తున్న వాళ్లు క్యాంప్ సైట్ల వద్ద చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తుఫాను కారణంగా మంచు చరియలు విరిగిపడి మూసుకుపోయిన దారులను స్థానికుల సాయంతో క్లియర్ చేస్తున్నారు.
ఇప్పటి వరకూ దాదాపు 350 మందిని రక్షించినట్లు సమాచారం. వాళ్లందరినీ ఆదివారం నాటికే క్యూదాంగ్ పట్టణానికి (Qudang township) తరలించారు. మరో 200 మందిని దశలవారీగా కిందకు తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 16 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో వారంతా చిక్కుకుపోయినట్లు చైనా మీడియా పేర్కొంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది.
❗️🗻🇨🇳 – A sudden blizzard stranded nearly 1,000 trekkers in the Karma valley near Mount Everest’s eastern face in Tibet.
By Sunday, October 5, 2025, rescuers guided 350 trekkers to safety in Qudang township, with contact established with the remaining 200-plus.
Heavy… pic.twitter.com/9Cfd5SlrJv
— 🔥🗞The Informant (@theinformant_x) October 6, 2025
Also Read..
Human Embryos | చర్మ కణాల నుంచి పిండం అభివృద్ధి.. ఒరేగాన్ వర్సిటీ ఘనత!
8 నిమిషాల్లోనే తిరస్కరించారు.. సోషల్ మీడియాలో భారతీయ టెకీ ఇంటర్వ్యూ పోస్ట్ వైరల్