సిడోయార్జో (ఇండోనేషియా), అక్టోబర్ 5: ఇండోనేషియాలో ఇస్లామిక్ బోర్డింగ్ పాఠశాల భవనం కుప్పకూలిన ఘటనలో మరణించిన విద్యార్థుల సంఖ్య 40కు చేరుకుంది. ఇండోనేషియా జావా ద్వీపానికి పశ్చిమాన ఉన్న సిడోయార్జోలో రెండంతస్తుల లో నిర్వహిస్తున్న పాఠశాల భవనం మంగళవారం ఆకస్మికంగా కూలిపోయింది. ఇంతవరకు రెండు డజన్ల మృతదేహాలను వెలికి తీశారని, ఇంకా 23 మంది ఆచూకీ గల్లంతైంద ని అధికారులు ప్రకటించారు. మృతులంతా 12-19 ఏండ్ల వయసున్న విద్యార్థులని చెప్పారు. మృతదేహాల వెలికితీత కొనసాగుతున్నదని, 95 మంది క్షతగాత్రులను దవాఖానలకు తరలించినట్టు చెప్పారు. ఒక్క విద్యా ర్థి మాత్రం చిన్న గాయం కూడా కాకుండా ప్రమాదం నుంచి బయటపడ్డాడన్నారు. భవనాన్ని నిర్మాణానికి అనుమతి లేదని తెలిపారు.