Delhi Metro | కొన్ని అసభ్యకర ఘటనలతో ఇటీవలే ఢిల్లీ మెట్రో (Delhi Metro) తరచూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అసభ్యకర చేష్టలు, ముద్దుసీన్లు, డ్యాన్స్ రీల్స్, ప్రయాణికుల మధ్య ఘర్షణలు వంటి వీడియోలు చర్చకు దారితీశాయి. మెట్రో రైల్లో ఇద్దరు ప్రయాణికులు రెజ్లింగ్ (Wrestling) తరహాలో పంచ్‌లు విసురుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీ మెట్రో కోచ్‌లో ఇద్దరు వ్యక్తులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదికాస్తా కాసేపటికి ఘర్షణకు దారితీసింది. ఇద్దరూ ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకున్నారు. నెట్టడం, తోసుకోవడం, తన్నుకోవడం, పంచ్‌లు విసురుకోవడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనతో రైల్లోని వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తోటి ప్రయాణికులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న కొందరు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అదికాస్తా వైరల్‌గా (Viral Video) మారింది. సీటు కోసమే ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Kalesh b/w Uncle and a guy inside delhi metro. pic.twitter.com/xt6NMKi5F1
— Ghar Ke Kalesh (@gharkekalesh) October 2, 2025
Also Read..
Sonam Wangchuk | సోనమ్ వాంగ్చుక్కు లభించని ఊరట.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
Mount Everest | మౌంట్ ఎవరెస్ట్‌పై మంచు తుఫాను బీభత్సం.. చిక్కుకుపోయిన 1,000 మంది ట్రెక్కర్స్