టైప్ 2 డయాబెటిస్ రివర్స్.. స్టెమ్ సెల్ థెరపీతో చైనా పరిశోధకుల అద్భుతం
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని కబళిస్తున్న డయాబెటిస్ మహమ్మారికి చైనా పరిశోధకులు అద్భుత చికిత్సను అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే మొదటిసారిగా స్టెమ్ సెల్ థెరపీ ద్వారా టైప్ 2 డయాబెటిస్‌ను నయం చేయగలిగారు.
- ప్రపంచంలోనే మొదటిసారి
బీజింగ్ : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని కబళిస్తున్న డయాబెటిస్ మహమ్మారికి చైనా పరిశోధకులు అద్భుత చికిత్సను అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే మొదటిసారిగా స్టెమ్ సెల్ థెరపీ ద్వారా టైప్ 2 డయాబెటిస్‌ను నయం చేయగలిగారు. భద్రత, సామర్థ్యాల్ని నిర్ధారించడానికి మరిన్ని క్లినికల్ ట్రయల్స్ అవసరం. అయినప్పటికీ.. ఈ ప్రయోగ ఫలితం భారత్ సహా ప్రపంచ దేశాలకు శుభవార్త. టైప్-2 డయాబెటిస్ రివర్సల్. అంటే మందులు లేకుండా చక్కెర వ్యాధిని నియంత్రించటం, వెనక్కి తిప్పటం. రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణ స్థితికి తీసుకురావటం.
ఎలా సాధించారు?
దాత నుంచి లేదా రోగి నుంచి స్టెమ్ సెల్స్‌ను సేకరిస్తారు. ల్యాబ్‌లో పాంక్రియాటిక్ ఐలెట్ సెల్స్‌గా మార్చుతారు. ఇవి బీటా సెల్స్‌గా మార్పు చెందుతాయి. శరీరంలో సహజ పద్ధతిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయటంలో ‘బీటా సెల్స్’దే ప్రధాన పాత్ర. పాంక్రియాటిక్లో దెబ్బతిన్న కణాల స్థానాన్ని ‘బీటా సెల్స్’ భర్తీ చేస్తాయి. ఈ వ్యవస్థ అంతటినీ అవయవ మార్పిడి ద్వారా పేషెంట్ శరీరంలోకి ఎక్కిస్తారు. దీనినే ‘స్టెమ్ సెల్’ థెరపీగా పేర్కొంటారు. దీంతో రోగికి మందులు, ఇంజెక్షన్ల అవసరం ఉండదు. అనేక దేశాలు దీనిపై ప్రయోగాలు చేస్తున్నా.. ప్రపంచంలో తొలిసారి చైనా సైంటిస్టులు దీంట్లో విజయం సాధించారు.
ఇన్సులిన్ పాత్ర కీలకం..
శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించటంలో ఇన్సులిన్ పాత్ర కీలకం. అయితే ఈ ఇన్సులిన్‌ను శరీరం సరిగా ఉపయోగించుకోని పరిస్థితిలో ఉండటమే ‘టైప్-2 డయాబెటిస్’గా పేర్కొంటారు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీసి.. బయటి నుంచి మందులు, ఇంజెక్షన్లు అవసరమవుతాయి. మందులు, ఇంజెక్షన్లు తీసుకోవటం మొదలయ్యాక డయాబెటిస్ రివర్సల్ అసాధ్యం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

