Air India | అమృత్సర్ నుంచి బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India) డ్రీమ్‌లైనర్ 787-8 విమానంలో (Boeing Dreamliner flight) అనూహ్య ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బర్మింగ్‌హామ్ (Birmingham) ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే యాక్టివేట్ అయ్యే ర్యామ్ ఎయిర్ టర్బైన్ (RAT) వ్యవస్థ ఉన్నట్లుండి ఆన్ కావడం కలవరానికి గురి చేసింది. ఈ ఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు ఘటనపై దర్యాప్తు చేపట్టింది.
శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా విమానంలోని రెండు ఇంజిన్లూ విఫలమైనప్పుడు లేదా ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్, హైడ్రాలిక్ వ్యవస్థల్లో పూర్తిస్థాయిలో వైఫల్యం చోటుచేసుకున్నప్పుడు మాత్రమే ర్యాట్ ఆటోమేటిగ్గా యాక్టివేట్ అవుతుంది. కానీ ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ర్యాట్ వ్యవస్థ ఆన్ కావిడం పైలట్లను కలవరానికి గురి చేసింది. అయితే ఎలాంటి సమస్యా లేకుండా విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయ్యిందని, అన్ని ఎలక్ట్రికల్, హైడ్రాలిక్ భాగాలు సాధారణంగానే పనిచేస్తున్నట్టు ఎయిర్ ఇండియా నిర్ధారించింది. రా ఎయిర్ టర్బైన్ వ్యవస్థ అనేది చిన్న ఫ్యాన్లాంటి పరికరం. ఇది విమానం శక్తిని కోల్పోయినప్పుడు స్వయం చాలకంగా వ్యవహరిస్తుంది.
Also Read..
ఎయిరిండియా విమానంలో ‘ర్యాట్’ యాక్టివేట్ సురక్షితంగా ల్యాండింగ్
Indian Origin | అమెరికాలో భారత సంతతి వ్యాపారి దారుణ హత్య
Mount Everest | మౌంట్ ఎవరెస్ట్‌పై మంచు తుఫాను బీభత్సం.. చిక్కుకుపోయిన 1,000 మంది ట్రెక్కర్స్